తాటి చెట్టుకి, ఈత చెట్టుకి కల్లు ఎలా వస్తుందో అలాగే కొబ్బరి చెట్టుకి కూడా వస్తుంది. కొబ్బరి కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పైగా నిషా తక్కువగా ఉంటుంది. ఈ కల్లు తాగితే నిషాతో పాటు బలం కూడా వస్తుంది. అంతేకాకుండా ప్రేగులలో ఉండే క్రిములను నశింపచేస్తుంది. గుడిలో ఇచ్చే ఏ ప్రసాదం అయినా పోషకాలతో ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేరళలోని ఓ ఆలయంలో కొబ్బరి కల్లుని తీర్ధంగా ఇస్తారంటే అర్ధం చేసుకోవచ్చు ఆ కల్లులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో.
శ్రీలంకలోని నాలుగు కల్లు ఉత్పత్తి సంస్ధలు ప్రతి ఏటా 60 మిలియన్ లీటర్ల కల్లును ఉత్పత్తి చేస్తున్నాయి. చెట్టు నుండి కల్లు తీసిన తరువాత దాని రుచి తియ్యగా ఉంటుంది. ఆరు గంటల తరువాత దాని రుచిలో తేడా వచ్చి ఉప్పదనం వస్తుంది. అలా అందులో ఆల్కాహాల్ శాతం పెరుగుతుంది. ఆ తరువాత దానిని విస్కీ, బ్రాందీల తయారీలో అనుసరించే స్వేదన ప్రక్రియకు గురిచేస్తారు. అలా చేయగా వచ్చిన దానిని ఆకర్షణీయమైన బాటిల్స్ లో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు.
త్వరలో ఈ కల్లును భారతదేశంలోకి కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో తయారవుతున్న కొబ్బరి కల్లు ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతౌతుంది. శ్రీలంకలో ఈ కొబ్బరి కల్లును డార్క్ రమ్ గా పిలుస్తారు. అక్కడి ప్రభుత్వానికి ఇదొక అదాయ వనరుగా మారటంతో ప్రభుత్వమే కల్లు తయారీని ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే అనేక కంపెనీలు కొబ్బరి కల్లును తయారీకి ఉత్సాహం కనబరుస్తున్నాయి.
సింగపూర్, జపాన్, బ్రిటన్ వంటి దేశాలలో కొబ్బరి కల్లును విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. శ్రీంలకన్ కంపెనీలు కొబ్బరి చెట్ల నుంచి కల్లును తీసి అట్రాక్టివ్ ప్యాకింగ్ చేసి సేల్స్ చేస్తున్నారు. వీటికి స్థానికంగానే కాకుండా వేరే ప్రాంతాల్లోనూ మంచి ఆధరణ లభిస్తోంది. బ్రిటన్ సింగపూర్ జపాన్ ఇంకా ఇతర దేశాలలో కొబ్బరి కల్లును విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఈ కల్లు ఉత్పత్తి చేసేందుకు శ్రీలంకన్ కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. నాలుగు పెద్ద కంపెనీలు ఏటా 60 మిలియన్ లీటర్ల కల్లును ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. చెట్టు నుండి కల్లు తీసిన తరువాత దాని రుచి తియ్యగా ఉంటుంది. 6గంటల తరువాత దాని రుచిలో తేడా వచ్చి ఉప్పదనం వస్తుంది. దాంతో కల్లులో ఆల్కహాలిక్ పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్రమంలో దీనిని అట్రాక్టివ్ బాటిల్స్ లేదా సీసాల్లో ప్యాకింగ్ చేస్తుంటారు.
ఇవి విస్కీ బ్రాండీలకు ధీటుగా కనిపిస్తాయి. త్వరలోనే ఈ కొబ్బరి కల్లును భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాటి, ఈత కల్లుతో పాటు ప్రస్తుతం కొబ్బరి కల్లు అందుబాటులోకి వచ్చేసింది. అక్కడ కొన్ని కంపెనీలు కొబ్బరి చెట్ల నుండి కల్లు తీసి వాటిని ఆకర్షణీయమైన సీసాల్లో ప్యాకింగ్ చేసి విక్రయాలు చేస్తున్నాయి. స్ధానికుల నుండి వీటికి మంచి ఆదరణ లభిస్తుంది.