రష్యాలో పార్లమెంట్ ఎన్నికల వేళ దారుణం చోటు చేసుకుంది. రష్యా పెర్మ్ నగరంలో ఓ యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అనేక మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. అయితే విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఆ దుండగుడిని పట్టుకున్నారు పోలీసులు.
ఓ బిల్డింగ్ నుంచి అనేక మంది విద్యార్ధులు భయంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఆరు నుంచి 14 మంది వరకు గాయపడినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. కాగా, గుర్తు తెలియని వ్యక్తి క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో భవనాల్లోని విద్యార్థులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట కూడా జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే క్యాంపస్‌కు చెందిన ఓ విద్యార్థే ఈ కాల్పులకు తెగబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయం తెలియరాలేదు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, ఇది అత్యంత ఓల్డ్ యూనివర్సిటీ. వీలైతే క్యాంప్‌ను వదిలి వెళ్లండి లేదా రూమ్‌ల్లోనే తాళాలు వేసుకుని ఉండాలని ఇవాళ ఉదయం యూనివర్సిటీ ఓ అలర్ట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. పెర్మ్ నగరంలో ఉన్న వైద్య అధికారులు సుమారు 10 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారతీయ విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది. స్థానిక అధికారులు, భారతీయ విద్యార్థుల ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
#BREAKING: Multiple people killed in mass shooting incident at university in Perm, Russiapic.twitter.com/7XOrUzkqrA
— I.E.N. (@BreakingIEN) September 20, 2021
#BREAKING: Gunman taken into custody following shooting at Perm university: media pic.twitter.com/9LXHoLBgX8
— I.E.N. (@BreakingIEN) September 20, 2021