ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గన్ కల్చర్ పడగవిప్పుతుంది. చోటా మోటా నేరగాళ్లు సైతం గన్స్ వాడుతూ హల్ చల్ చేస్తున్నారు. సాధారణంగా సినీ, రాజకీయ, బడా వ్యాపారుల వద్ద లైసెన్స్ ఉన్న గన్స్ ఉంటాయి.. కానీ ఈ మద్య కొంతమంది అక్రమఆయుధాలు సప్లై చేసేవారి వద్ద లైసెన్స్ లేని గన్స్ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అక్రమార్కుల నుంచి లైన్సెన్స్ లేని గన్స్ ఖరీదు చేస్తున్న కేటుగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఇక అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మైనర్లు కూడా గన్ తో కాల్పులు జరిపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రంలో కాల్పుల మోత మోగింది. శాక్రమెంటో కౌంటీలో ఉన్న ఓ గురుద్వారా లో ఇద్దరు వ్యక్తుల మద్య వివాదం చెలరేగడంతో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఒక్కసారే తుపాకీల శబ్ధాలు రావడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. గాయపడిన వారిలో ఒకరు భారత సంతతికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన ఇద్దరు ఇరువురి మద్య విద్వేశపూరితంగా జరిగిన కాల్పులు అని పోలీసులు తెలిపారు.
శాక్రమెంటో కౌంటీలో ఉన్న ఓ గురుద్వార లో నగర్ కీర్తన్ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంతా ప్రశాంతంగా జరుగుతుందనుకుంటున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల మద్య చిన్న వివాదం పెద్దగా మారిపోయింది. దాంతో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకునే స్థాయికి వెళ్లిందని విచారణ జరిపిన పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గురుద్వారా ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని.. అంతా తమ అదుపులోకి తెచ్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. భారత్ లో ఈ మద్య ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ ను అరెస్ట్ సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాల్లో ఖలిస్థాన్ సానుభూతిపరులు ఆందోళనకు తెగబడుతున్నారు. ఈ సమయంలో గురుద్వారలో జరిగిన కాల్పులు కలకలం రేపుతుంది.
The US | “Two people shot at a Gurudwara in Sacramento County, California. The shooting is not related to a hate crime, it is a shootout between two men who knew each other,” says Sacramento County Sheriff’s Office. pic.twitter.com/zKWY58yWOY
— ANI (@ANI) March 27, 2023