రోజు రోజూకి దిగజారుతున్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిత్రదేశాలు కూడా పాకిస్థాన్ ను అడుక్కునే దేశంగా చూస్తున్నాయంటూ విచారం వ్యక్తం చేశారు. తమ కంటే చిన్న చిన్న దేశాలు ఆర్ధికంగా తమను దాటిపోతున్నాయని, అయితే తాము మాత్రం 75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నట్లు షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇస్లామాబాద్ లో న్యాయశాస్త్ర విద్యార్ధుల స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. తమ దేశం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. ఏ మిత్ర దేశాల్లో మాములు పర్యటనకు వెళ్లినా… డబ్బుల కోసమే వచ్చామని అనుకుంటున్నారని తెలిపారు. చివరకు ఫోన్ చేసినా కూడా డబ్బుల కోసమే చేశామను అనుకుంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ…” గతంలో మనకంటే ఆర్ధికంగా వెనుబడిన దేశాలు ఇప్పుడు ఎంతో అభివృద్ధిలో ఉన్నాయి. చాలా చిన్నదేశాలు సైతం పాక్ ను దాటేసి పోయాయి. మనం మాత్రం 75 ఏళ్లుగా బిచ్చగాళ్లలా జోలె పట్టుకుని తిరుగుతూ అడుకుంటున్నాం. నేను ప్రధాని కాక ముందు కూడా మన దేశ పరిస్థితి ఇదే.. అయితే వరదలతో ఇప్పుడు మరింత దారుణంగా మారింది” అని విచారం వ్యక్తం చేశారు. తాజా వరదల నేపథ్యంలో మిత్ర దేశం చైనా సాయం కేవలం ప్రకటనకే పరిమితం అయ్యింది. వారి దేశంలో సంభవించిన చిన్నపాటి కరువును, కరోనాను సాకుగా చూపుతూ పాక్ కి సాయం చేయడంలో చైనా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని చేసిన కామెంట్లు పరోక్షంగా చైనా మీదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి.. పాక్ ప్రధాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.