ప్రేమలో ఉన్నప్పడు ఒకరినొకరు విడిచి క్షణం కూడా ఉండలేనంతగా ప్రేమికులు ఉంటారు. కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ గంటలను క్షణాల్లా గడిపేస్తుంటారు. ఇక పార్కులు, సినిమాలు, విహార యాత్రలు అంటూ రెక్కలు కట్టుకుని ఈ ప్రేమ పక్షలు విహరిస్తుంటాయి. అయితే పొరపాటున వారి ప్రేమ చెడితే ఇంక అంతే సంగతులు. ఒకరినొకరు చూసుకునేందుకు అస్సలు ఆసక్తి చూపించారు. కొందరు అయితే ఇంకా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారు కనిపించకుండా ఉండేందుకు అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా పాప్ సింగర్ షకీరా అదే పనిచేసింది. తన మాజీ ప్రియుడు స్పెయిన్ ఫుట్ బాల్ స్టార్ గెరార్డ్ పీక్ ముఖం కనిపించకుండా.. వారు కొనుగోలు చేసిన ఓ ఇంట్లో మధ్యలో గోడ కట్టించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పాప్ సింగర్ షకీరా, ఫుట్ బాల్ స్టార్ గెరార్డ్ పీక్ మధ్య 12 ఏళ్ల బంధం ముగిసిన సంగతి తెలిసిందే. ఇద్దరికి మనస్పర్ధలు కారణంగా గతేడాది తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. అయితే అప్పటి నుంచి కూడా ఇద్దరు ఒకే ఇంట్లో వేరువేరుగా ఉంటున్నారు. ఈ ఇద్దరు కలిసి ఉన్న సమయంలో బార్సిలోనా ప్రాంతంలో రెంంతస్తుల ఇల్లును కొన్నారు. చాలా కాలం పాటు ఆ ఇంట్లోనే ఇద్దరు తమవైవాహిక బంధాన్ని కొనసాగించారు. ఇక ఇటీవల విడిపోయిన తరువాత నుంచి ఇద్దరు అదే ఇంట్లో వేరు వేరుగా ఉంటున్నారు. పీక్ తన తల్లిదండ్రులతో అదే ఇంట్లోని రెండో అంతస్తులో ఉంటున్నాడు. కింది ఫ్లోర్ లో షకీరా ఉంటుంది.
అయితే మాజీ ప్రియుడుపై కోపమో లేకా మరేమో కానీ ఇటీవల విచిత్రమైన పని చేసింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ మొహం చూడకూడదని అడ్డుగా గోడను నిర్మించింది. షకీరా తన ఇంటికి సిమెంట్ మిక్సర్ కాంక్రీట్ లారీ రావడం టీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ గోడ నిర్మాణం విషయం బయటపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోన్నాయి. ఇన్ని గొడవలు, మనస్పర్ధల మధ్య వాళ్లతో కలిసి ఉండలేనని, వాళ్ల ముఖం కూడా చూడలనిపించడం లేదని అందుకే గోడ కట్టిస్తున్నట్లు షకీరా పేర్కొంది. అయితే ఆమె వ్యవహారశైలిపై షీక్ తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోడను తీసేయాలని షకీరాను పీక్ తల్లి అడిందని, అయినప్పటికి ఆమె నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని సమాచారం. ఇక గెరార్డ్ పీక్ విషయానికి వస్తే.. అతడు 2009 నుంచి స్పెయిన్ ఫుట్ బాల్ జట్టులో ఆడుతున్నాడు. స్పెయిన్ జట్టులో పీక్ బ్యాక్ సెంటర్ ప్లేయర్ గా ఉంటున్నాడు. ఇంతేకాక పీక్ కొన్ని క్లబ్ తరపున కూడా ఆడుతుంటాడు. మాంచెస్టర్ యునైటెడ్, బార్సిలోనా క్లబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. షకీరా గోడ నిర్మాణం చెప్పడటంతో ఈ ఇద్దరూ మరోసారి వార్తలో నిలిచారు. మరి.. షకీరా చేసిన చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.