కొంతమంది బతుకుదెరువు కోసం సొంతవాళ్లను విడిచి వేరే రాష్ట్రానికి, ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. ఎంత కష్టమైనా వారి కుటుంబం కోసం రాత్రింబవళ్లు పనిచేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాల్లో సంతోషమనేదే లేకుండా పోతుంది. అలా పరాయి దేశం వెళ్లిన ఓ వ్యక్తికి.. అతడి కంపెనీ ఉద్యోగులు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కొంతమంది బతుకుదెరువు కోసం సొంతవాళ్లను విడిచి వేరే రాష్ట్రానికి, ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. ఎంత కష్టమైనా వారి కుటుంబం కోసం రాత్రింబవళ్లు పనిచేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాల్లో సంతోషమనేదే లేకుండా పోతుంది. పండుగలు, ఫంక్షన్లు అన్నింటికీ దూరంగా ఉండి కష్టపడుతుంటారు. ఈ విధంగానే ఓ వ్యక్తి కూడా ఉద్యోగరీత్యా కుటుంబాన్ని విడిచి విదేశానికి వెళ్లి ఓ కంపెనీలో సెక్యూరిటీగార్డ్ గా పని చేస్తున్నాడు. విధినిర్వహణలో తను సొంత ఊరుకు రాలేక పోతున్నాడు. దానికి తను మనస్సులో చాలా బాధపడుతుంటాడు.
తను మలేషియాలోని ఓ కంపెనీలో ఎనిమిదేళ్లుగా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ, ఇంటికి డబ్బులు పంపించేవాడు. అయితే ఏటా వచ్చే తన పుట్టిన రోజు నాడు తను చాలా మనోవేదనకు లోనయ్యేవాడు. ఆ సంతోషకరమైన రోజు తను కుటుంబానికి దూరంగా ఉన్నాననే బాధతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేవాడు కాదు. ఒక్కడే ఒంటరిగా కుమిలిపోయేవాడు. అయితే తను పనిచేసే కార్యాలయ ఉద్యోగులు తన పుట్టిన రోజును తెలుసుకుని సెక్యూరిటీ గార్డ్ కు సర్ ప్రైస్ గిఫ్ట్ ఇచ్చారు. ఉద్యోగులు తన పట్ల చూపిన ప్రేమకు ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న తనకు ఉద్యోగులు ఆ లోటు లేకుండా చేశారని కన్నీరు పెట్టుకున్నాడు.
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఆ వ్యక్తికి ఎనిమిది ఏళ్లుగా ఇంటికి వచ్చే అవకాశం రాలేదు. అయితే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు సెక్యూరిటీ గార్డ్ పుట్టిన రోజును తెలుసుకుని, బర్త్ డే చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఓ కేక్ ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. ఆ తరువాత సెక్యూరిటీ గార్డ్ ను లోపలికి పిలిచారు. ఉద్యోగులు ఇచ్చిన సడెన్ సర్ ఫ్రైజ్ ను చూసిన అతను ఆశ్చర్యపోయాడు. ఉద్యోగులు గార్డ్ చేత కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజును జరిపిన ఉద్యోగులకు సెక్యూరిటీ గార్డ్ ధన్యవాదాలు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషళ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆఫీస్ ఉద్యోగులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.