హజ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికుల బస్సు ఓ వంతెనను ఢీకొట్టింది. యాసిర్ గవర్నరేట్ పరిధిలోని అకబా షార్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వంతెనను బలంగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. దీంతో అందులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ యాక్సిడెంట్లో 20 మంది యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో 29 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సౌదీ పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
ఎమర్జెన్సీ సహాయక బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానిక అధికారులు నిర్ధారించారు. యాక్సిడెంట్ తర్వాత చెలరేగిన మంటలను అదుపు చేశామని ఫైర్ సేఫ్టీ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
20 Hajj Pilgrims Killed, Dozens Injured In Bus Crash In Saudi Arabia https://t.co/8XVhXJcV4y pic.twitter.com/c2IZEdf8L7
— NDTV News feed (@ndtvfeed) March 28, 2023