పీరియడ్స్ అనేది చాలా సున్నితమైన అంశం. మహిళలకు పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ చాలా అవసరం. పీరియడ్స్ సమయంలో శుభ్రంగా లేకపోతే మహిళలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయమని అంటారు. కానీ అందరికీ వీటిని కొనే స్థోమత ఉండదు. అందుకే స్కాట్‌లాండ్ తమ దేశ మహిళల గురించి ఆలోచించి ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఆగస్ట్ 15 నుంచి దేశమంతటా ఉన్న మహిళలకు పీరియడ్ ప్రాడెక్టులను ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రపంచంలోనే ఈ విధంగా దేశ వ్యాప్తంగా శానిటరీ ప్యాడ్స్‌ను అందించిన తొలి దేశంగా స్కాట్‌లాండ్ నిలిచింది. నిజానికి ఉచిత పీరియడ్ ప్రాడెక్ట్స్ చట్టం అనేది 2020లోనే తెరపైకి వచ్చింది. 2017 నుండి పబ్లిక్ ప్రదేశాల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ను అందుబాటులో ఉంచడానికి 2500 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది అక్కడి ప్రభుత్వం.
స్కాట్‌లాండ్ పార్లమెంట్ మెంబర్ ‘మోనికా లెన్నన్’ అనే మహిళ 2020లో దీనికి క్యాంపెయినింగ్ చేస్తూ.. ఏకగ్రీవంగా పార్లమెంట్‌లో దీన్ని ఆమోదించారు. అప్పటి నుండి టాంపన్స్, శానిటరీ ప్యాడ్స్ వంటి పీరియడ్ ప్రాడెక్ట్స్‌ను పాఠశాలలు, కళాశాలలు వంటి బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటివరకూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉచితంగా పీరియడ్ ఉత్పత్తులను అందించిన ప్రభుత్వం.. నేటి నుండి అంటే ఆగస్ట్ 15 నుండి ప్రతీ మహిళకీ అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బిల్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని మంత్రులకు బాధ్యతను అప్పగించింది స్కాట్‌లాండ్ ప్రభుత్వం. శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా పొందడం స్కాట్‌లాండ్ మహిళల హక్కు అని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రపంచ చరిత్రలోనే ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన ప్రధమ దేశంగా పేరు తెచ్చుకుంది. ఈ విధానం భారత్‌తో పాటు అన్ని దేశాల్లోనూ అమలులోకి రావాలని ఆశిద్దాం. మరి స్కాట్‌లాండ్ ప్రభుత్వం చేస్తున్న ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Scotland makes public health history by becoming the first country in the world to protect the legal right to free period products https://t.co/cGOAWnFPzl
— BBC Scotland News (@BBCScotlandNews) August 15, 2022