ప్రపంచ దేశాలు ఎంత వారించినా.. ఎంతగా నచ్చజెప్పినా రష్యా అధ్యక్షులు పుతిన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు.. యుద్ధం మొదలైపోయింది. ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని మెయిన్ సిటీస్‌ను టార్గెట్ చేసింది రష్యా. కేపిటల్ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు.
ఈ దాడిని అన్యాయమైన దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ డాడిలో జరిగే మరణాలకు, విధ్వంసాలను రష్యా మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జో బైడెన్ అన్నారు. అమెరికా.. దాని మిత్ర పక్షాలు ఐక్యంగా, నిర్మయాత్మకంగా స్పందిస్తామయని ఆయన హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందస్తు ప్రణాళికలతో యుద్ధాన్ని ఎంచుకున్నారని ఆరోపించారు. అయితే రష్యా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా దాడికి ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. ఉక్రెయిన్ లో పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని అమెరికా స్పష్టం చేసింది. కాగా, రేపు ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ 7 దేశాలతో పాటు.. నాటో మిత్ర దేశాలతో సమావేశం కాబోతున్నట్లు సమాచారం.