రష్యా , ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటికీ ఏడవ రోజు కొనసాగుతోంది. రష్యా సైన్యం కైవ్‌పై దాడి చేయడం ప్రారంభించింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా దాడులు చేసింది. ఈ ఘటనలో పలు ప్రధాన కార్యాలయాలతో పాటు భారీ భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజా నివాస ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయి. అయితే యుద్దం మొదలైనప్పటి నుంచి ప్రపంచ దేశాలు శాంతిని కోరుతూనే ఉన్నాయి.. రష్యాని యుద్దం విరమించాలని కోరుతూనే ఉన్నాయి. అన్ని రకాలుగా రష్యాపై ఆంక్షలతో వత్తిడి పెంచారు.
తాజాగా ప్రపంచ దేశాల ఒత్తిడిలో రష్యా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. దాంతో నేటి ఉదయం 11:30గంటల నుంచి కాల్పుల విరమణ. అయితే ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులను తరలించేందుకు యుద్ధ విరామం తీసుకుంది. ఐదున్నర గంటలపాటు యుద్ధానికి బ్రేక్ ఇచ్చింది రష్యా. తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా.