మనిషి టెక్నాలజీ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మనిషి సాధించలేని అంటూ ఏదీ లేదు అని ఎన్నోసార్లు నిరూపించాడు. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన విషయంలో ఎంతో పురోగాభివృద్ది సాధిస్తూ వస్తున్నాడు. ఈ సమయంలో కొన్ని మానవ తప్పిదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా చంద్రుడి వైపు దూసుకువెళ్తున్న ఓ రాకెట్ గుట్టు విప్పారు ఖగోళ శాస్త్రవేత్త బిల్ గ్రే. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్లూటో సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తున్న ఆయన ఈ రహస్యాన్ని బహిర్గతం చేశారు. చంద్రుడిపైకి వెళ్తున్న రాకెట్.. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌ది కాదు అని, అది చైనా ప్రయోగించిన ఛేంజ్5- మిషన్ రాకెట్ అని ఆయన తేల్చారు.
ఇది చదవండి: బర్త్ డే వేడుకల్లో దారుణం! చూస్తుండగానే చిన్నారి ప్రాణం పోయింది!
చంద్రుడి ఉపరితలం దిశగా దూసుకువెళ్తున్న ఆ రాకెట్‌ను తొలి సారి బిల్ గ్రే గుర్తించారు. చైనా ఈ రాకెట్‌న్‌ను 2014లో ప్రయోగించింది. చంద్రుని ఉపిరితలం దిశగా దూసుకొస్తుందని ఆయన తొలిసారిగా గుర్తించారు. ఛేంజ్ 5 టీ1 లునార్ మిషన్‌కు చెందిన బూస్టర్ చంద్రుడి దిశగా వెళ్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి మొదట్లో ఆ రాకెట్ బూస్టర్ ఫాల్కన్-9 రాకెట్‌కు చెంది ఉంటుందని అనుమానించారు. డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ శాటిలైట్‌ను 2015లో ప్రయోగించారు. దానికి సంబంధించి టూ స్టేజ్ రాకెట్ చంద్రుడి వైపు వెళ్తున్నట్లు మొదట్లో బిల్ గే అనుమానించాడు. కానీ ఆయన పరిశోధనలో అది ఫాల్కన్-9 రాకెట్ కాదని.. 2014, అక్టోబర్ 23వ తేదీన ప్రయోగించిన ఛేంజ్5-టీ1 మిషన్‌కు చెందిన రాకెట్ చంద్రుడి వైపు దూసుకువెళ్తున్నట్లు గ్రే తెలిపారు.