చావు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు పక్కనే ఉన్న మనవాళ్లు ఉన్నట్టుండి చనిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో గుండెపోటుతో చాలా మంది చనిపోతున్న విషయం తెలిసిందే. ఇటు చిన్న పిల్లల నుంచి అటు పండు ముసలవ్వల వరకు హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఓ ఘోర ప్రమాదంలో ఒకేసారి 30 మంది చనిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
మీడియా కథనం ప్రకారం.. పాకిస్తాన్ కొహిస్తాన్ జిల్లాలోని మంగళవారం రాత్రి ప్రయాణికులతో ఓ బస్సు గిల్గిట్ నుంచి రావల్పిండి బయలుదేరింది. షీతయా ప్రాంతానికి చేరుకోగానే బస్సు, ఓ కారు ఢీ కొన్నాయి. దీంతో ఆ కారు, బస్సు క్షణాల్లో పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏకంగా 30 మంది మరణించినట్లు తెలుస్తుంది. ఇదే కాకుండా 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాద ఘటనపై పాక్ ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
— Hardin (@hardintessa143) February 8, 2023