భారత మూలాలున్న రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు 200 సంవత్సరాల పాటు ఏకధాటిగా మనల్ని పాలించిన దేశానికి నేడు.. భారత సంతతి వ్యక్తి ప్రధాని కావడం పట్ల భారతీయుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎవరైనా ఊహించారా.. జీవితం అంటేనే ఇది.. ఊహించని అద్భుతాలు అనేకం చోటు చేసుకుంటాయి అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఇక రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వేళ.. అనూహ్యంగా భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. వీరద్దరి గురించి సోషల్ మీడియాలో తెగ మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.
కారణం ఏంటంటే.. రిషి సునాక్, ఆశిష్ నెహ్రాలకు పోలికలు ఉండటంతో.. మీరిద్దరూ సోదరులా ఏంటి అంటూ మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఇక కొందరు మీమర్స్ అయితే ఏకంగా.. రిషి స్థానంలో నెహ్రా ఫోటోలను మార్ఫ్ చేసి.. శుభాకాంక్షలు చెబుతూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మీరద్దరు సోదరులా ఏంటి.. కొంపతీసి కుంభామేళాలో తప్పి పోలేదు కదా అంటూ ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు. ప్రసుత్తం ఈ మీమ్‌లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక నెహ్రా బ్రిటన్ ప్రధాని అయ్యాడు కనుక.. కోహీనూర్ వజ్రాన్ని వెంటనే ఇండియాకు తీసుకురావాలని కోరుతున్నారు. ఫన్నీ మీమ్స్‌పై మీరు ఓ లుక్కేయండి.
Rishi Sunak and Ashish Nehra seem to be brothers who were estranged in Kumbh Ka Mela.#Rumor
😜😆 pic.twitter.com/rMSrFOZb3r— SOCRATES (@DJSingh85016049) October 24, 2022
Congratulations Ashish Nehra ji ❤️#ipl2022 bhi Jeet Gaye aab UK pr Raaj sahi hai 🤌😂#RishiSunak pic.twitter.com/ReDU9XKPWS
— Rahul Barman (@RahulB__007) October 24, 2022
PM Modi and PM #RishiSunak discussing how to get Kohinoor back to India. pic.twitter.com/mXlWR0q2r9
— Vinay (@Being_Humor) October 24, 2022
Well done Ashish Nehra on becoming the next UK Prime Minister. Bring ‘IT’ home. #Kohinoor #RishiSunak pic.twitter.com/iUceugMdBG
— Kaustav Dasgupta 🇮🇳 (@KDasgupta_18) October 24, 2022
#RishiSunak with #ViratKohli ❣️ pic.twitter.com/6IICYVwuxK
— Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) October 24, 2022
This is such a special Diwali. #HappyDiwali #RishiSunak pic.twitter.com/Aae6YtOxsx
— ★·.· ᴘʀɪɴᴄᴇ ᴋᴀʀᴀɴ ★·.· (@Prince_OCT13) October 24, 2022
So many records broken by young Rishi Sunak,
Ab to kohinoor be aaiga.#RishiSunak is new UK PM pic.twitter.com/EwKhWJVbgB— HARDY (0.99) (@HardyARB_) October 24, 2022
ఇక రిషి .. మాజీ ప్రధాని బోరిస్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా చేసి.. అందరి చేత ప్రశంసలు పొందాడు. బోరిస్ జాన్సన్ తర్వాత రిషి సునాక్ ప్రధాని పదవి కోసం పోటీ పడ్డాడు. కానీ అప్పుడు లిజ్ ట్రస్‌కు ఆ అవకాశం దక్కింది. కానీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజులకు ఆమె రాజీనామా చేయడంతో.. తాజాగా రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. అంతేకాక అతి పిన్న వయసులో ప్రధాని పదవి చేపట్టడమే కాక.. తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.