కొంతమందికి అదృష్టం శని పట్టినట్టు పడుతుంది. తమ మీద నమ్మకం లేకపోయినా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తారు. కానీ నమ్మకం లేకుండా కొనుగోలు చేసిన వారినే లాటరీ వరిస్తుంది. తమకు లాటరీ తగిలిన విషయం చెప్పినా నమ్మరు. తాజాగా ఓ వృద్ధుడికి ఏకంగా రూ. 328 కోట్లకు పైనే లాటరీ వరించింది.
పెళ్లయ్యాక పిల్లల కోసం కష్టపడి జీవితాన్ని త్యాగం చేసి 60 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకుంటారు. ఆ వయసులో పని చేయడం కష్టం. ఒకవేళ పని చేసినా ఎక్కువ డబ్బు సంపాదించే ఆస్కారం ఉండదు. అసలు ఆ వయసులో ఒంట్లో పట్టు పోయి పట్టుదల పెరిగిపోతుంది. పట్టుదల వస్తే అండర్ వేర్ మార్చడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది కోట్లు సంపాదించడం ఎవరి వల్ల అయినా అవుతుందా? కానీ 61 ఏళ్ల వయసులో ఒక మాజీ మెకానిక్ ఏకంగా రాధే శ్యామ్ కి పెట్టిన బడ్జెట్ కి సమానమైన సొమ్మును లాటరీలో గెలుచుకున్నాడు. ఏదో సరదాగా టికెట్ కొంటే సీరియస్ గా లాటరీ తగిలేసింది.
కొంతమందికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది. వందల, వేల మందిలో ఒక్కరికే ఆ అదృష్టం వరిస్తుంది. ఇలా ఎంతోమంది లాటరీలో కోట్లు గెలుచుకున్నారు. అలాంటి వారిలో ఈ మాజీ మెకానిక్ ఒకరు. అమెరికాకు చెందిన మాజీ మెకానిక్ గెలుచుకున్న లాటరీ అమౌంట్ రూ. 328 కోట్లు పైనే. అమెరికాలోని అయేవా రాష్ట్రంలోని డుబుక్యూ లోవాలోని 61 ఏళ్ల ఎర్ల్ లాపే మెకానిక్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఇటీవల అతను ‘లోట్టో అమెరికా’ లాటరీ టికెట్ ను కొనుగోలు చేశాడు. అయితే ఆయన కొన్న టికెట్ కు లాటరీ తగిలింది. ఈ విషయాన్ని స్నేహితుడు చెబితే తొలుత నమ్మలేదు. ‘ఒరేయ్ నువ్వు 40,030,000 డాలర్లు లాటరీ గెలుచుకున్నావ్ రా’ అని చెప్తే.. ‘ఛా ఊరుకో నాకు లాటరీ తగలడమేంటి? ఏప్రిల్ ఫూల్ చేయామకు’ అంటూ సమాధానమిచ్చాడు.
నిజంరా సామి.. నువ్వు లాటరీ గెలుచుకున్నావ్ అని అంటే అప్పుడు నమ్మాడు. మొదట నమ్మకపోవడానికి కారణం.. అతను ఏప్రిల్ ఫూల్స్ డే నాడు లాటరీ టికెట్ కొన్నాడు. తనను ఫూల్ చేస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ ఆ తర్వాత నమ్మాడు. దీంతో ఎర్ల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోమవారం లాటరీ కార్యాలయానికి వెళ్లి టికెట్ ను క్లెయిమ్ చేసుకున్నాడు. అయితే లాటరీ కార్యాలయం వారు విడతల వారీగా 29 ఏళ్ల పాటు లాటరీ డబ్బు చెల్లిస్తామని అన్నారు. అలా వద్దు గానీ ఒకేసారి ఇచ్చేయండి అని అడిగాడు. దీంతో ముందు ఆయనకు రూ. 175 కోట్లు చెల్లించి.. ఆ తర్వాత మిగతా డబ్బును ఇవ్వనున్నారు. మొత్తానికి మన కరెన్సీ ప్రకారం ఆ వృద్ధుడు 328 కోట్ల 35 లక్షల 40 వేల రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో నెటిజన్స్.. ‘ముసలోడే గానీ మహానుభావుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి 328 కోట్లు పైనే లాటరీ గెలుచుకున్న ఇతనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.