ప్రతి పౌరుడికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదే. అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దు అని చెప్తుంటారు. ఎన్నికల్లో తమకు నచ్చిన సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఈ ఓటు ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. అయినప్పటికీ ఓటును చాలామంది కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. ఇంతటి మహనీయ చరిత్ర ఉన్న ఓటు హక్కును 16 ఏళ్లు దాటిన వారందరకి కల్పించాలనే ఉద్దేశ్యంతో న్యూజిలాండ్ ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించాలని భావిస్తోంది.
ప్రస్తుతం న్యూజిలాండ్ లో 18 ఏళ్ళు పైబడిన వారికే ఓటు హక్కు ఉంది. దీన్ని16 ఏళ్లకు తగ్గించడాన్ని పరిశీలిస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ తెలిపారు. ఈ మేరకు పార్లమెంటులో ఒక చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. 18 ఏళ్లు దాటిన వాళ్లకే ఓటు హక్కు కల్పించడమంటే..యువత యొక్క మావన హక్కుల్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆ దేశ సుప్రీంకోర్టు ఓ కేసులో సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆధారంగానే 16 ఏళ్లు పైబడిన అందరకి ఓటు హక్కు కల్పించాలని న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ప్రధాని జసిందా ఆర్డెర్న్.. ఓటింగ్ వయస్సు తగ్గించడానికి తాను వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నానని తెలిపారు. కానీ, ఈ మేరకు చట్టాన్ని రూపొందించడానికి తన ప్రభుత్వానికి సరైన మెజార్టీ లేదని, అందుకు 75 శాతం మెజార్టీ కావాలని తెలిపారు. కాగా, ప్రస్తుతానికి బ్రెజిల్, ఆస్ట్రియా మరియు క్యూబా వంటి కొన్ని దేశాలు18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి ఓటు వేసే హక్కుల్ని కల్పిస్తున్నాయి.
New Zealand’s highest court found that the current voting age of 18 was inconsistent with the country’s Bill of Rights, which gives people a right to be free from age discrimination when they have reached 16 https://t.co/6lTosEMRl5 pic.twitter.com/0NysZOtipH
— Reuters (@Reuters) November 22, 2022
The Supreme Court has just declared that preventing 16 and 17 year-olds from voting is inconsistent with the Bill of Rights. Parliament cannot ignore that. It is time to make the voting age 16!!!!!!
— Make it 16 (@makeit16nz) November 20, 2022