గర్ల్‌ఫ్రెండ్ లేదని బాధపడే సింగిల్స్‌కు గుడ్ న్యూస్. తమకూ ఓ స్నేహితురాలు ఉంటే బాగుంటుందని అనుకునే వారి బాధలు ఇక తీరిటన్లే. ఓ చోట అందమైన గర్ల్ ఫ్రెండ్స్‌ను అద్దెకు తీసుకోవచ్చు. మిగిలిన వివరాలు..
చైనాలో బ్యాచిలర్స్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆ దేశ మీడియా సంస్థ వీడో సర్వే ప్రకారం.. చైనాలో పెళ్లవని వారి సంఖ్య 40 కోట్లకు పైనే అని తెలుస్తోంది. అక్కడ పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య పెరగడానికి నిరుద్యోగం ఓ కారణమట. వివాహం కంటే కెరీర్ ముఖ్యమని కొంత మంది యువకులు భావిస్తున్నారట. మరి కొందరు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నారట. ఇలా పలు కారణాల వల్ల పెళ్లికి నో చెబుతుండటంతో అక్కడ పెళ్లి కాని వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యువతను మ్యారేజ్ చేసుకోమని చైనా సర్కారు ప్రోత్సహిస్తోంది. అలాగే లెక్కకు మించి పిల్లల్ని కనాలని ఎంకరేజ్ చేస్తోంది. పెళ్లి చేసుకోవాలంటూ చైనాలో పేరెంట్స్ తమ పిల్లలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. యువతలో మ్యారేజ్ మీద ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో బ్లైండ్ డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారు.
వీటన్నింటి మధ్య అక్కడో కొత్త వ్యాపారం జోరందుకుంది. చైనాలో గర్ల్‌ఫ్రెండ్స్, భార్యలను అద్దెకు తీసుకుంటున్నారట. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ సమాచారం ప్రకారం.. డ్రాగన్ కంట్రీలో గర్ల్‌ఫ్రెండ్స్, భార్యలను రెంట్‌కు ఇచ్చే వెబ్‌సైట్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. గర్ల్‌ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా బాయ్‌ఫ్రెండ్స్ కూడా అద్దెకు అందుబాటులో ఉన్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. చైనాలోని ప్రతి ప్రావిన్స్‌లోనూ ఈ వ్యాపారం జోరుగా సాగుతోందట. ఇక్కడ ప్రతి ప్రాంతంలో అద్దెకు గర్ల్‌ఫ్రెండ్స్ లేదా భార్యను అందించే కంపెనీలు ఉన్నాయి. వెబ్‌సైట్ ద్వారా గర్ల్‌ఫ్రెండ్‌లను అద్దెకు తీసుకుని చేస్తున్న ఈ వ్యాపారం విలువ రూ.కోట్లలో ఉంటుందని మార్నింగ్ పోస్ట్ అంచనా వేసింది. చాలా మంది మహిళలు ఈ పనిని పార్ట్ టైమ్ ఉద్యోగంగా భావిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని సమాచారం.