ముఖ్యంగా గర్భిణీలలో చర్మం చాలా మార్పులు, చేర్పులకు గురవుతుంది. చర్మం పొడిగా లేదా జిడ్డుగా తయారవుతుంది. చర్మంలో స్ట్రెచ్ మార్క్స్ కు ఎక్కువగా కనబడుతాయి. సాధారణంగా అధికబరువు, సెడెన్ గా బరువు తగ్గడం వల్ల ఏర్పడుతుంటాయి.ఫ్యాట్ కణాలు ఎక్కడ చేరుతాయో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. గర్భధారణ సమయంలో నార్మల్ డెలివరీనా, సిజేరియన్ అనా తేడా లేకుండా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం సహజం సమస్యే. అయితే వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవడం మంచిది.
కొన్ని చిట్కాలు మీకోసం కోకో, బట్టర్ ఉన్న క్రీమ్స్‌ను ఉపయోగించి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట నెమ్మదిగా మసాజ్ చేయాలి. స్నానం చేసిన అనంతరం విటమిన్-ఇ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనెను రాసుకోవాలి. క్రమపద్ధతిలో మార్క్స్‌పైన మసాజ్ చేయాలి. జింక్ అధికంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, సోయా బీన్స్ స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గిస్తాయి. నీరు ఎక్కువగా తాగాలి. చర్మం పొడిబారకుండా చూసుకోవడం ద్వారా మార్క్స్‌ను తగ్గించుకోవచ్చు.
పొటాటో జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడంలో గా సహాయపడుతుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ సులభంగా తొలగిపోతాయి. ఈ పొటాటో జ్యూస్ ను అప్లై చేసిన తర్వాత , డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
మరిన్ని వివరాలకై ఈ వీడియో చూడండి: