చరిత్ర గతిలో ఇప్పటి వరకు మనం నమ్మలేని అనేక వింతలు, విశేషాలు, సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. శాస్త్రసాంకేతికత పెరిగిన నేటి కాలంలో కూడా కొన్ని మిస్టరీలను చేధించలేకపోతున్నాం. అసలు సదరు సంఘటనలు ఎలా సాధ్యం అయ్యాయో అంతు బట్టకుండా ఉంటుంది. ఎన్నడో ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనల్లో కొన్ని తాజాగా వైరలవుతన్నాయి. ఈ క్రమంలో మదర్స్ డే రోజున.. చరిత్ర గతిలో నిలిచిపోయిన ఓ వింత సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆడుతూ.. పాడుతూ.. సంతోషంగా గడపాల్సిన 5 ఏళ్ల పసిప్రాయంలో ఓ చిన్నారి బిడ్డకు జన్మనిచ్చింది. నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది వాస్తవంగా చోటు చేసుకున్న సంఘటన. వైద్యాశాస్త్రానికి నేటికి సవాలు విసురుతున్న ఈ వింత సంఘటన వివరాలు…
పెరు దేశంలోని టిక్రాపోకు చెందని లీనా మదీనా అనే చిన్నారి.. 1933, సెప్టెంబర్ 27న జన్మించింది. అందరు చిన్నారుల్లానే సంతోషంగా, ఆడుతూపాడుతూ గడపాల్సిన ఆ చిన్నారి జీవితంలో ఐదో ఏట ఊహించని మలుపు తిరిగింది. ఏకంగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. లీనాకు ఐదేళ్లు వయసు వచ్చేసరికి.. ఆ చిన్నారి పొట్ట పెద్దగా అవ్వడం గమనించారు కుటుంబ సభ్యులు. దాంతో చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని చూసిన వైద్యులు తొలుత ఆమె కడుపులో కణితి ఉందని భావించారు. కానీ పరీక్షలు చేయగా.. వారికి షాకింగ్ విషయం తెలిసింది. ఎందుకంటే లీనా కడుపులో ఉన్నది కణతి కాదు.. బిడ్డ అని వైద్య పరీక్షల్లో తెలిసింది.
ఇది కూడా చదవండి: Viral Video: అసని ఎఫెక్ట్.. ప్రాణాపాయం నుండి తప్పించుకున్న వ్యక్తి! వైరల్ వీడియో!
ఐదేళ్ల చిన్నారి గర్భం దాల్చడం ఏంటని ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటు వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పట్లో ఈ వార్త పెను సంచలనంగా మారింది. ఇదిలా ఉండగానే.. 1939, మే 14 లీనా మగ బిడ్డకు జన్మనిచ్చింది. సిజరేయన్ ద్వారా బిడ్డను వెలికి తీశారు వైద్యులు. లీనా జన్మనిచ్చిన బిడ్డ బరువు 2.7 కిలోలతో ఎంతో ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత ఐదేళ్ల చిన్నారి బిడ్డకు జన్మనివ్వడం ఎలా సాధ్యం అని పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో లీనాకు ప్రికోషియస్ ప్యుబర్టీ అనే సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అందువల్లే లీనాలో చిన్న వయసులోనే లైంగిక అవయవాలు అభివృద్ధి చెందినట్లు కనుగొన్నారు. ఈ క్రమంలోనే లీనాలో మూడేళ్ల వయసులోనే పీరియడ్స్ ప్రారంభం అయ్యాయని వెల్లడించారు. అయితే లీనా గర్భవతి ఎలా అయిందన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేకపోయారు.
ఇది కూడా చదవండి: Bangkok: 21 ఏళ్లుగా భార్య శవంతో సహజీవనం చేస్తున్న డాక్టర్!
దీనికి సంబంధించి ఓ వార్త ప్రచారంలో ఉంది. అందేంటంటే.. ప్రతి ఏటా టిక్రాపోలో ప్రాంతంలో ఓ సంప్రదాయ పండగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా యువతీయువకులు తమకు నచ్చినవారితో శృంగారంలో పాల్గొంటారు. దీన్ని అవకాశంగా తీసుకుని.. ఎవరైనా చిన్నారి లీనాపై అత్యాచారం చేసి ఉండవచ్చని అనుమానించారు. జరిగిన దారుణం గురించి లీనా ఎవరికి వెల్లడించకపోయి ఉండవచ్చని భావించారు. అయితే లీనాకున్న అరుదైన సమస్య వల్ల.. ఆమె గర్భం దాల్చడంతో.. దారుణం వెలుగు చూసింది. అంతేకాక ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నమ్మశక్యం కానీ సంఘటన చోటు చేసుకుని.. నేటికి 90 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికి కూడా వైద్య చరిత్రలో ఇదొక వింతగా మిగిలిపోయింది. ఇక ఈ విచిత్ర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Rooster: సెలెబ్రిటీ కోడిని హత్య చేసిన మహిళా అధికారి.. మృతదేహం కోసం అన్వేషణ..