బ్రిటన్ క్వీన్ ఎలిజబిత్-2 వృద్ధాప్య కారణంగా గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతకు ముందే ఎలిజబిత్-2 ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు అందరూ బాల్మోరల్ కోటకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం పరిస్థితి క్షిణించి కన్నుమూశారు. ఈ విషయాన్ని కామన్వెల్త్ దేశాలకు బ్రిటన్ విదేశాంగ శాఖ తెలియజేసింది. ఆమె మృతికి పలు దేశాధినేతలు, మంత్రులు సంతాపం తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన అందరిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. క్వీన్ ఎలిజబిత్-2 తర్వాత బ్రిటన్ ను పగ్గాలు చేపట్టేది ఎవరు? ఇప్పటి వరకు ఆమె ధరించిన కోహినూర్ వజ్రం ఎవరికి దక్కుతుంది? మరి.. ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్యుడు అస్తమించని బ్రిటన్ సామ్రాజ్యాన్ని దాదాపు 70 ఏళ్లపాటు క్వీన్ ఎలిజబిత్-2 పాలించింది. గురువారం ఆమె స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు. దీంతో ఆమె తర్వాత ఆమె మొదటి కుమారుడు ప్రిన్స్ చార్లెస్ ప్రోటోకాల్ ప్రకారం కింగ్ అయ్యారు. దీంతో రాజుకు దక్కే అధికారలు, సకల మర్యాదలు ప్రిన్స్ చార్లెస్ కు అందనున్నాయి. ఇదే సమయంలో చార్లెస్ బ్రిటన్ కింగ్ అయినప్పుడు, ఆయన భార్య కెమిల్లా క్వీన్ కన్సార్ట్ అవుతుంది. ఇదే విషయాన్ని ఎలిజబిత్-2 ఈ ఏడాది మొదటిలోనే ప్రకటించారు. ప్రిన్స్ చార్లెస్ రాజు అవ్వడంతో కోహినూర్ వజ్రం ఉన్న కిరీటాన్ని రాణిగా ఉండనున్న కెమిల్లా అందుకుంటుంది. అయితే అంత పేరొందిన కోహినూర్ వజ్రం భారతదేశానికి చెందినదని చాలా మంది చరిత్రకారులు తెలిపారు. ఈ వజ్రం 105.6 క్యారెట్ల ఉంటుంది.
ఇది 14వ శతాబ్దంలో భారతదేశంలో గోల్కొండ ప్రాంతంలో బయట పడిందని చెబుతారు. ఆ తర్వాత ఈ వజ్రం ఎందరో పాలకుల చేతులు మారింది. చివరకు పంజాబ్ ను పాలించే రాజుల వద్దకు చేరింది. అక్కడ 1849లో పంజాబ్‌ను బ్రిటిష్ స్వాధీనం చేసుకుంది. దీంతో కోహినూర్ వజ్రం ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. అలా ఆ వజ్రం చివరికి అప్పటి బ్రిటన్ క్వీన్ విక్టోరియా చేతికి వెళ్లింది. అయితే అప్పటి నుంచి బ్రిటీష్ రాణుల కీరిటంలో ఈ కోహినూర్ చేరింది. మరొకవైపు కోహినూర్ తమదంటే తమదని భారత్ తో సహా మరో నాలుగు దేశాలు తమదంటే తమదని చెబుతున్నాయి. ఈ ఇష్యూపై ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది. మరి.. ఎలిజబిత్-2 సంబంధించిన కోహినూర్ వజ్రం ఉన్న కిరీటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.