ఈ మధ్యకాలంలో కొందరు ప్రజాప్రతినిధుల ప్రవర్తన దారుణంగా ఉంటుంది. ప్రజలకు జవాబుదారితనంగా ఉంటున్న ప్రజాప్రతినిధులు.. అసెంబ్లీలో పాటించే విలువలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్నిచోట్ల అధికార ప్రతిపక్షాల మధ్య దాడుల కూడా జరుగుతున్నాయి. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని మరచి కూడా కొందరు ప్రజాప్రతినిధులు ప్రవర్తిసుంటారు. తాజాగా ఓ రాష్ట్రంలోని అసెంబ్లీ రణరంగంగా మారింది. ఏకంగా డిప్యూటీ స్పీకర్ పై దాడికి తెగబడ్డారు. అంతటితో ఊరుకోకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు. ఈ దారుణమైన ఘటన పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు అసెంబ్లీ సమావేశమైంది. ఈ సభకు డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీ అధ్యక్షత వహించడానికి వచ్చారు. అయితే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఎమ్మెల్యేలు అతనిని అడ్డుకుని తీవ్రంగా కొట్టారు. పీటీఐ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనపై వాటర్ బాటిల్ విసిరినట్లు సమాచారం. చెప్పుతో కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చేశారని వార్తలు వచ్చాయి. పంజాబ్ అసెంబ్లీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, పీటీఐ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో వాయిదా పడింది.
అయితే కాసేపటి మరోసారి సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీకీ ఆలస్యంగా వచ్చిన పీటీఐ ఎమ్మెల్యేలు తమతో పాటు పేపర్లు తెచ్చుకుని వాటిని చించి స్పీకర్ పైకి విసిరారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీని వీడి.. ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలపై కామెంట్ల్ చేస్తూ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
آج اسمبلی میں جو کچھ ہوا وہ میرے علم میں ہے کہ کس نے کروایا اور کون کون لوگ ملوث ہیں۔
میری HC اور قوم سے کمٹمنٹ ہے کہ اسمبلی کا اجلاس بھی آج ہی ہو گا اور وزیراعلیٰ کا الیکشن بھی آج ہی ہو گا۔میر صاحب گواہ رہیے گا، میں آئین سے وفاداری نبھا کر رہوں گا۔@HamidMirPAK @asmashirazi pic.twitter.com/V871J4X5yy
— 𝐒𝐚𝐫𝐝𝐚𝐫 𝐃𝐨𝐬𝐭 𝐌 𝐌𝐚𝐳𝐚𝐫𝐢 (@Dost_M_Mazari) April 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.