అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఓ మాజీ మంత్రి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవడమే కాదు, కారు ఎక్కి పారిపోయేందుకు కూడా యత్నించాడు. అయినప్పటికీ అతనిని పోలీసులు వదలి పెట్టలేదు. వెంటపడి మరీ అతన్ని పట్టుకున్నారు.
పార్టీ అధినేత అరెస్టయినప్పుడు ఆ పార్టీ నేతలు, మద్దతుదారులు.. నిరసనలకు, హింసాత్మక ఆందోళనలకు దిగడం సర్వసాధారణం. ఆ ఆందోళనలే ఓ మాజీ మంత్రి మెడకు ఉచ్చులా బిగిచుకున్నాయి. ఒక కేసులో బెయిల్ పొందిన కాసేపటికే మరో కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో అతడు వారి నుంచి తప్పించుకునేందుకు కోర్టు లోపలికి పరుగులు పెట్టారు. నవ్వులు తెప్పించే ఈ ఘటన పాకిస్తాన్ లోని ఇస్లాబామాద్ హైకోర్టు వద్ద చోటుచేసుకుంది.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాక్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. ఇమ్రాన్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలకు, హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు పాక్ మాజీ మంత్రి, పీటీఐ పార్టీ సీనియర్ నేత ఫవాద్ చౌధరీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన తనను కావాలనే పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు, ఫవాద్‌ను మంగళవారం కోర్టు ఎదుట హాజరుపరచగా.. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన ఆయన తన కారులో ఇంటికి బయల్దేరారు.
అయితే కాసేపటికే పోలీసులు ఆయనను మరో కేసులో అరెస్టు చేసేందుకు యత్నించారు. దీంతో ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కారు దిగి వేగంగా కోర్టు లోపలికి పరుగులు పెట్టారు. కోర్టు బెయిల్ ఇచ్చినా తనను మళ్లీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయమూర్తి ఎదుట భోరున విలపించారు. ఈ విషయంపై స్పందించిన జడ్జీ.. మరో పిటిషన్ దాఖలు చేయాలని ఆయనకు సూచించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఒకానొక సమయంలో ఫవాద్ పరిగెత్తి కిందపడిపోగా.. లాయర్లు ఆయనకు సాయం చేసి కోర్టు లోపలికి తీసుకెళ్లారు. కాగా, ఇమ్రాన్‌ఖాన్ హయాంలో ఫవాద్ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా వ్యవహరించారు. మన నాయకుల పట్ల కూడా పోలీసులు ఇలా వ్యవహరిస్తే బాగుంటుందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
When the force personnel arrived to arrest Fawad Chaudhry outside the High Court, Fawad Chaudhry escaped, leaving his wife and took refuge in the High Court.
Chief Justice Bandyal has made the courts a haven for PTI criminals.#سانحہ_9_مئی_کا_مجرم_عمران pic.twitter.com/WoA1lOgWaG— Ghazi Butt (@GhaziButt6) May 16, 2023
Former Pakistan cabinet minister & @PTIofficial member Fawad Chaudhry sees Punjab Police (Pakistan) and runs back inside the court. This is the Pakistani version of “Puls aa gayi Puls”.
Dabboo Ji is all of 100 plus kgs but his heart is that of an athlete. #HowsTheKorma pic.twitter.com/k2iokgPqxL
— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) May 16, 2023