Professor Calls Police : మీరు ఓ కాలేజ్‌లో లెక్షరర్‌గా పనిచేస్తున్నరనుకోండి? క్లాసుకు ఆలస్యంగా వచ్చిన వారికి ఎలాంటి శిక్ష విధిస్తారు. ఓ రెండు దెబ్బలు కొట్టి లోపలకు పిలవటమో.. లేదా క్లాసులోకి రావద్దు వెళ్లిపోండి అనటమో.. గోడ కుర్చీ వేయించటమో.. ఇలా ఏదో ఒకటి చేస్తారు. చెప్పిన మాట వినకపోతే కొంత సీరియస్ అవుతారు. వారు ఎన్ని నిమిషాలు క్లాసుకు ఆలస్యంగా వచ్చారన్న దాన్ని బట్టి శిక్ష విధిస్తారు. కానీ, ఓ టీచర్ కేవలం రెండే రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చారని, తన మాట లెక్క చేయలేదని ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కొన్ని రోజుల క్రితం క్లాసుకు రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.
దీంతో ప్రొఫెసర్ వాళ్లను క్లాసులోంచి వెళ్లిపోవాలన్నాడు. వారిలో ఒక విద్యార్థి ‘‘ ఇక్కడ ఉండటానికే డబ్బులు చెల్లిస్తున్నాము’’ అని అన్నాడు. దీంతో లెక్షరర్ కోపంగా బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆయుధాలు కలిగిన పోలీసులతో అక్కడి వచ్చాడు. పోలీసులను చూడగానే ఇద్దరు ఏడవటం మొదలుపెట్టారు. పోలీసులు కొంత సేపటి తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను తోటి విద్యార్థి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై యూనివర్శిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. సదరు లెక్షరర్‌ను విధులనుంచి తొలగించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ల్యాడ్ అవుతుండగా.. రెండు ముక్కలైన విమానం! వీడియో వైరల్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.