గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మనుషు ప్రాణాలే కాదు.. ఆర్థిక నష్టాలను కూడా తెస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుంది. తాజాగా కరోనా పరిస్థితిపై ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ప్రసంగిస్తుండగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆమె ముద్దుల కూతురు లైవ్ స్ట్రీమింగ్ లోకి రావడంతో ఆమె తన ప్రసంగాన్ని ఆపి… ‘డాలింగ్… ఇంకా పడుకోలేదా? ఇది పడుకునే సమయం. వెళ్లి పడుకో.. ఒక నిమిషంలో నేను వస్తా’ అని తన కూతురుకి చెప్పింది.. కానీ కూతురు నీవ్ మాత్రం నో అంటూ మాటవినలేదు. జస్ట్ ఒక నిమిషంలో వచ్చి కలుస్తాను, ఓకేనా… సారీ అంటూ ఆర్డెర్న్ తన కూతుర్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు.
ఫేస్‌బుక్ లైవ్‌ను మళ్లీ కంటిన్యూ చేస్తూ.. అందరూ క్షమించాలని నవ్వుతూ అన్నారు. తన కూతురుకి నిద్రాభంగం అయినట్టుందని చెప్పారు. మీ పిల్లలెవరైనా నిద్రలో ఇలాగే లేస్తున్నారా? అని ప్రశ్నించారు. అయితే, తన కూతురుని చూసుకోవడానికి తన తల్లి ఉన్నారని చెప్పారు. తర్వాత ‘మనం ఎక్కడదాకా వచ్చాం?’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఒక దేశ ప్రధాని అయివుండి తన కూతురిపై ఆమె చూపించిన ప్రేమను ప్రశంసిస్తున్నారు. కూతురు కోసం తన ప్రసంగాన్నే ఆపేయడాన్ని హర్షిస్తున్నారు. కాగా, 41 ఏళ్ల జసిండా రెండో సారి న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రధానిగా ఉండగానే కూతురుకి ఆమె జన్మనిచ్చారు. తల్లి కూతురు ప్రేమ గురించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Watch the moment PM Jacinda Ardern’s 3-year-old daughter Neve interrupted her during a COVID update on Facebook live 👇 pic.twitter.com/jj5zokPoVm
— Al Jazeera English (@AJEnglish) November 9, 2021