సాధారణంగా విహారయాత్రలంటే ఇష్టపడని వారుండరు. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా కొత్తగా ట్రై చేద్దాం.. అనుకునే వారికి ప్రపంచంలో చూడాల్సిన ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. ‘పాప్ కార్న్’ అంటే మనకు తినే పదార్థంగానే తెలుసు. కానీ పాప్ కార్న్ అనేది సహజంగా లభిస్తుంది అంటే.. నమ్ముతారా? నిజమేనండి.
పాప్ కార్న్ సహజంగా దొరుకుంటుందంటే.. ఖచ్చితంగా అరుదనే చెప్పాలి. అంత అరుదుగా లభిస్తుందంటే.. అది తినేదా? కాదా? అనే సందేహాలు రావచ్చు. అది నిజమే.. ఏకంగా పాప్ కార్న్ దొరికే బీచ్ ఉంది. కానీ ఆ బీచ్ లో దొరికే పాప్ కార్న్.. తిందామని అనుకుంటే మాత్రం పక్కాగా మీ ముప్పైరెండు పళ్ళు ఊడిపోతాయ్..!అదేంటి.. పాప్ కార్న్ తింటే పళ్లు ఊడిపోతాయ్? అంటున్నారు. అంటే.. అది పాప్ కార్న్ లా కనిపించే ఇసుక కాబట్టి. అసలు విషయం ఏంటనేది తెలియాలంటే.. ఓసారి స్పెయిన్ దేశానికి వెళ్లాల్సిందే. స్పెయిన్ లోని కెనరీ దీవులు అద్భుతమైన సహజ సంపదను కలిగి ఉన్నాయి. ఆ విషయం అక్కడి స్థానికులకు తప్ప బయట ఎవరికీ తెలీదు. వేరే బీచెస్ అన్ని వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయాయి. కానీ ఈ పాప్ కార్న్ బీచ్ మాత్రం ఇప్పుడిప్పుడే టూరిస్టుల ఫేవరేట్ లిస్టులో చేరుతుంది.
కెనరీ దీవులలో ఫ్యూర్టెవెంచురా ప్రాంతానికి ఉత్తరాన ఈ పాప్‌కార్న్ బీచ్ ఉంది. ఈ బీచ్ అసలు పేరు.. ఎల్ హిరో బీచ్(El Hierro beach). ఇది లా ఒలివాలో ఉంది. ఈ ప్రాంతం నుండి ఫస్ట్ పాపులర్ అయిన బీచ్ ఇదే. ఇక్కడికే వచ్చే యాత్రికులు బీచ్ లోని పాప్ కార్న్ ఇసుకను తింటున్నట్లుగా వెరైటీ ఫోజులతో ఫోటోలు దిగుతుంటారు. తెల్లటి(వైట్) రంగులో ఆకర్షించే బీచ్ ఇసుక.. పాప్ కార్న్ లాగే చూపరుల మనసు దోచుకుంటుంది. గత 50 ఏళ్లుగా ఈ బీచ్ లో ఇసుక పాప్ కార్న్ లా ఉండటం విశేషం. కొన్ని కథనాల ప్రకారం.. ప్రతి నెల ఇక్కడి బీచ్ ఇసుకలో 10 కిలోల వరకు పగడాలు దొరుకుతుంటాయని సమాచారం. మరి ఈ అద్భుతమైన పాప్ కార్న్ బీచ్ సహజ సౌందర్యం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.