Ponytail Ban : జపాన్‌లోని స్కూళ్లు పోనీ టేయిల్‌ను బ్యాన్ చేశాయి. ఇకపై అమ్మాయిలు ఎవరూ పోనీ టేయిల్‌తో స్కూళ్లకు రాకూడదని ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ ఆంక్షలు అంతటితో ఆగలేదు.. అమ్మాయిలు కేవలం తెల్ల రంగు అండర్‌వియర్(లోదస్తులు) మాత్రమే వేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పోనీ టేయిల్‌ను బ్యాన్ చేయటానికి ఓ కారణం ఉందట.. పోనీ టేయిల్ వేసుకున్న అమ్మాయిల మెడ సొంపులు అబ్బాయిల్ని రెచ్చగొట్టి వారిలో కామోద్రేకం కలిగేలా చేస్తాయట. ఇందు కారణంగానే స్కూళ్లు పోనీ టేయిల్‌ను బ్యాన్ చేశాయి. ‘బురోకు-కోసోకు’ సాంప్రదాయాల్లో భాగంగా స్కూళ్లో చదివే విద్యార్థిని, విద్యార్థులపై ఇలాంటి కఠిన నియమాలు పెడుతుంటారు. 2020లో ఫుకుఒక ఏరియాలో జరిగిన సర్వేలో 10లో ఒక స్కూలు పోనీ టేయిల్‌పై బ్యాన్ విధించింది.
పోనీ టేయిల్స్ కారణంగా అబ్బాయిల్లో కామ కోరికలు పెరుగుతాయని సదరు స్కూలు యజమాన్యాలు పేర్కొంటున్నాయి. అయితే, పిల్లలపై ఆంక్షలకు సంబంధించిన దారుణాలు ఈ రెండితోటే ఆగలేదు. జపాన్ దేశంలోని స్కూళ్లలో చదివే పిల్లలు ఏ రంగు సాక్సులు వేసుకోవాలి, స్కర్టు పొడవు ఎంత ఉండాలి, ఐ బ్రోస్ షేపు ఎలా ఉండాలి అన్నదానిపై కూడా ఆంక్షలు ఉన్నాయి. పిల్లలు వారి జట్టుకు రంగు వేసుకునే హక్కుకూడా లేదు. ఒక వేళ వారి జుట్టు రంగు నలుపు, సాధారణ రంగు కాకుండా వేరే రంగులో ఉంటే.. జుట్టుకు ఎలాంటి రంగు వేయలేదని, సహజసిద్ధమైన రంగేనని నిరూపించాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 22 ఏళ్లుగా చికెన్ మాత్రమే తింటున్న యువతి.. ఎందుకో తెలుసా!
కరాటే పోటీల్లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన చిచ్చర పిడుగు..!