భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎన్నోదేశాలు పర్యటించారు. ఆయనకు పలు దేశ ప్రధానులు తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించారు. పాపువా న్యూ గినియా దేశంలో జరిగే ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కూపరేషన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ పాపువా న్యూ గినియా దేశంలో జరిగే ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కూపరేషన్ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఆ దేశం వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పలు దేశాల మధ్య మైత్రి విషయంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్నో పురస్కారాలు లభించాయి. తాజాగా ప్రధాని మోదీకి అరుదైన పురస్కారం లభించింది. వివరాల్లోకి వెళితే..
భారత ప్రధాని నరేంద్ర మోదీ కి మరో అరుదైన పురస్కారం లభించింది. ఫిజీ పౌరులకు ఇచ్చే అత్యున్నత ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’పురస్కారంతో ప్రధాని నరేంద్ర మోదీని సత్కరించారు. ప్రపంచ నాయకత్వ లక్షణాలు మోదీలు ఉన్నాయని.. ఆయన ప్రపంచ దేశాల్లో గొప్ప రాజనీతిజ్ఞుడని.. ఆయన గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ఈ పురస్కారం ఇచ్చామని ఫిజీ దేశం ప్రకటించింది. తమదేవ పౌరుడు కాకపోయినా.. ఆయనకు గౌరవ సూచకంగా ఈ పురస్కారం అందించామని తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అత్యుత్తమ పురస్కారం లభించడం భారత్ కి దక్కిన పెద్ద గౌరవం అని ప్రకటించింది భారత ప్రధాని కార్యాలయం. ఇరు దేశాల మధ్య మైత్రిలో కీలక పాత్ర పోషంచిన భారత ప్రజలకు, ఫిజీ-ఇండియన్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ గౌరవాన్ని అంకితం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేధికగా తెలిపింది. ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఎన్నో దేశాలు పర్యటించారు. చాలా మంది ప్రధానులు తమ దేశ అత్యుత్తమ పురస్కారాలను అందజేశారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారంతో భారత ప్రధానిని సత్కరించడం దేశం గర్వించదగ్గ విషయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Prime Minister Modi conferred highest civilian Honour of Fiji and Papua New Guinea for his global leadershiphttps://t.co/QBStILtUIM
— All India Radio News (@airnewsalerts) May 22, 2023