ఈ మధ్యకాలంలో వివిధ రూపలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుని అనేక మంది అమాయకులు బలైపోయారు. అగ్నిప్రమాదాలు, రోడ్డు యాక్సిడెంట్స్, విమాన ప్రమాదాలు వంటివి చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా విమాన ప్రమాదాల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఇటీవలే అమెరికాలో రెండు హెలికాఫ్టర్ లు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అలానే సాంకేతిక లోపంతో కొన్ని విమానాలు నేలపై కుప్పకూలిపోతున్నాయి. ఇలాంటి ఘటనల్లో పదుల సంఖ్యలో జనాలు దుర్మరణం చెందుతున్నారు. తాజాగా నేపాల్ దేశంలో దారుణమైన ఘటన జరిగింది. సంక్రాంతి పండగ వేళ ఆదేశంలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లో అందరు తమ గమ్యానికి చేరుకుంటాము అనుకునే సమయంలో సాంకేతి లోపంతో విమానం కుప్పకూలిపోయింది. అందరూ చూస్తుండగానే అందులోని 72 సజీవ దహనం అయ్యారు.
ఆదివారం నేపాల్ లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. యేతి ఎయిర్ లెైన్స్ కు చెందిన ఏటీఆర్-72 విమానం ఖాట్మాండు లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి పొఖారాకు ఆదివారం ఉదయం 10.33 గంటల సమయంలో బయలుదేరింది. 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో బయలుదేరిని విమానం కొన్ని క్షణాల్లో గమ్య స్థానానికి చేరుకోనుంది. సరిగ్గా పొఖారా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానాన్ని రన్ వేపై ల్యాండ్ చేసేందుకు ఫైలెట్ ఎంతో ప్రయత్నం చేశాడు. అయిన ఫలితంలేకుండా పోయింది. స్థానికులు చూస్తుండగానే ఇళ్లపై నుంచి వెళ్తూ.. పొఖారా విమానాశ్రయ సమీపంలోని కొండ ఢీకొట్టి కుప్పకులిపోయింది.
దీంతో అందరూ చూస్తుండగానే అందులోని 72 మంది కాలిబూడిదై పోయారు. సేతి గండకి అనే నది పరీవాహక ప్రాంతంలోని అటవీ ప్రదేశంలో ఈ విమాన దుర్ఘటన జరిగింది. ఈ నది పాత డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు, పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యలో ప్రవహిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్ లు, ఇద్దరు కొరియన్ లు, ఇద్దరు ఐర్లాండ్ కు చెందినవారు. అంతేకాక ఆఫ్ఘనిస్థాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు కూడా ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ ఘటనపై ఆదేశ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు నివాళిగా ఓ రోజు సంతాపం దినంగా ప్రకటించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Video of what seems to be moments before the crash of Yeti Airlines🇳🇵 ATR72 carrying 72 passengers near Pokhara Airport#aerowanderer #aviation #avgeek #nepal #yetiairlines pic.twitter.com/hk12Edlvpf
— Aerowanderer (@aerowanderer) January 15, 2023