అప్పటివరకు అతను పిజ్జా డెలివరీ బాయ్.. కానీ, ఈ ఘటనతో ఆ ప్రాంతానికి అతనొక హీరో అయిపోయాడు. పిజ్జా డెలివరీ చేసి అర్ధరాత్రి ఇంటికి వెళ్తుండగా.. దారిలో ఓ ఇల్లు మంటల్లో కనిపించింది. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లిపోయి ఐదుగురు సజీవదహనం కాకుండా కాపాడాడు. ఆ ఘటనలో అతనికి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని లఫయెట్టేలో నికోలస్ బోస్టిక్ అర్ధరాత్రి పిజ్జా డెలివరీ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నాడు. అక్కడ దారి మధ్యలో ఓ ఇల్లు మంటల్లో తగలబడుతూ కనిపించింది. ఏ మాత్రం ఆలోచించకుండా కేకలు వేస్తూ ఆ ఇంట్లోకి పరుగులు తీశాడు. అతని అరుపులు విని ఇంట్లో ఉన్న వాళ్లంతా నిద్ర లేచారు. వెనుక నుంచి ఇంట్లోకి ప్రవేశించిన బోస్టిక్ నలుగురు పిల్లలను క్షేమంగా బయటకు పంపాడు.
On the evening of July 11th, 25-year-old Nicholas Bostic of Lafayette, IN rescued five children from a burning home. Bostic was driving by when he saw the home engulfed in flames. He stopped, rushed in, saw four kids, and brought them to safety, but then realized there was one pic.twitter.com/OZQpf82N3x
— Haneefah Khaaliq for U.S. Senate (@HaneefahKhaaliq) July 17, 2022
ఆ సమయంలో కేకలు విని గ్రౌండ్ ఫ్లోర్ మరో చిన్నారి ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే పైఅంతుస్తులోని అద్దాలు పగలగొట్టి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాడు. ఆ సమయంలో అతనికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. తగలబడిపోతున్న గదిలోకి ప్రవేశించిన బోస్టిక్ అక్కడున్న ఆరేళ్ల చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. రక్షించిన వారిలో 18 సంవత్సరాలు, 13 ఏళ్లు, ఏడాది చిన్నారి కూడా ఉన్నారు.
Heroic actions of a Lafayette Citizen saves the lives of several children! #hero #inspiring #courage #awesome @City_Lafayette pic.twitter.com/s5eLfNs21Q
— LafayetteINPolice (@LafayetteINPD) July 14, 2022
ప్రస్తుతం 25 ఏళ్ల బోస్టిక్ చేసిన ఈ పనిని స్థానికులు మాత్రమే కాదు.. పోలీసులు సైతం కొనియాడుతున్నారు. బోస్టిక్ డెలివరీ బాయ్ కాదు రియల్ లైఫ్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నిశ్వార్థంగా ఆలోచించి బోస్టిక్ ఐదుగురి ప్రాణాలు కాపాడాడంటూ పోలీసులు ప్రశంసించారు. బోస్టిక్ సాహసానికి సంబంధించిన ఒక వీడియో కూడా పోలీసులు విడుదల చేశారు. ఈ కుర్రాడి సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Here’s the video to go along with the story. pic.twitter.com/TvZ5wzCg1f
— LafayetteINPolice (@LafayetteINPD) July 15, 2022