పైలట్ ఉద్యోగం చెప్పుకోవడానికి ఎంత హుందాగా ఉన్నా.. అది కత్తి మీద సాములాంటిందే. విమానం గాల్లోకి ఎగిరిన దగ్గర నుంచి నేలపై ల్యాండ్ అయ్యేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిందే. ఏరోజుకి ఆరోజు నేను సేఫ్ అనుకుంటూ ఉంటారు. అందుకే పైలట్ కావడం అందరి వల్లా కాదు. వీరికి ధైర్య సాహసాలతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉండాలి. అది ఉండబట్టే ఈ పైలట్.. గాల్లో కలవాల్సిన తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు.
విషయం ఏంటంటే.. బెల్జియంలో మినీ ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో ఉండగా అందులో సాంకేతిక సమస్య తలెత్తింతి. అందులో ఉన్న పైలట్ ఏ మాత్రం కంగారు పడకుండా పారాచూట్ సాయంతో రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి. కొన్ని చిన్న తరహా విమానాల్లో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం ఉంటుంది. అది వాడి పైలట్ తన ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.