Philippines Boy: ప్రతి గింజపై దాన్ని తినే వాడి పేరు రాసుంటుందని అంటుంటారు. మనం తినడానికి భూమి మీద ఇంకా నూకలు మిగిలి ఉంటే ఏం జరిగినా మన ప్రాణాలు పోవు. విమానంలోనుంచి కిందకు తోసినా.. తాళ్లతో కట్టేసి నడి సముద్రంలో పడేసినా ఏదో ఒక సహాయం అంది బయటపడిపోవచ్చు. ఆ టైంలో పనికి రాదు అనుకున్నది కూడా మనకు పనికొచ్చి ప్రాణాలు నిలుపుతుంది. తాజాగా, ఓ పిల్లాడు పాత ఫ్రిడ్జ్ సహాయంతో తన ప్రాణాలను రక్షించుకున్నాడు. తుఫాను కారణంగా కొండచరియలు విరిగి ఇళ్లపై పడిన ఘటననుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పిన్స్‌లోని బేబే సిటీలో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బురద కొండచరియ విరిగి సీజే జేమ్స్ అనే 11 ఏళ్ల బాలుడి ఇంటిపై పడింది. ప్రమాదాన్ని గుర్తించిన బాలుడు ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. ఠక్కున ఇంట్లోని పాత ఫ్రిడ్జ్‌లోకి దూరాడు. మిగిలిన కుటుంబ సభ్యులు ఆ బుదరతోటే కొట్టుకుపోయారు. జేమ్స్ ఫ్రిడ్జ్‌లో ఉండటం వల్ల బతికి బట్టకట్టాడు. దాదాపు 20 గంటల పాటు దానిలోనే ఉండి పోయాడు. బాలుడు ఉన్న ఫ్రిడ్జ్ నీటిలో కొట్టుకుంటూ ఓ నది తీరానికి చేరుకుంది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది విరిగిపోయిన ఫ్రిడ్జ్‌లో ఉన్న బాలుడ్ని గుర్తించారు. అనంతరం అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రాణాల మీదకు తెచ్చిన హస్తప్రయోగం.. కుప్పకూలిన 20 ఏళ్ల కుర్రాడు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.