ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. చిన్న చిన్న తప్పిదాల వల్ల ఎన్నో వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతో మంది అంగవైకల్యంతో బాధపడుతూ రోడ్డున పడుతున్నారు. ఓ వైపు రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయరాదని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొంత మంది తప్పిదాల వల్ల ఈ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా నేపాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడిపోవడంతో 32 మంది ప్రయాణికులు మరణించారు. మరికొంత మంది పరిస్థితి విషయమంగా ఉందని అధికారులు తెలిపారు. నేపాల్‌గంజ్ నుంచి గాంగాధి వెళ్తున్న బస్సు ముగు జిల్లాలోని ఛయనాథ్ రారా మునిసిపాలిటీ పరిధిలో.. అదుపుతప్పి పీనాజ్యారీ నదిలో 982అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది.
దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ సొంత ఊళ్లకు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అంత ఎత్తు మీద నుంచి బస్సు పడిపోవడంతో ప్రమాద స్థాయి ఎక్కువగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యల కోసం ఆర్మీని రంగంలోకి దింపారు.