పిచ్చి పలు రకాలు.. అంటారు పెద్దలు. దానికి తగ్గట్లే కొంత మంది వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాల్లో కొంత మంది మనుషులు ప్రవర్తించే తీరును చూస్తే అసలు వీడు మనిషేనా అని అనుమానం వస్తుంది. తాజాగా అలాంటి అనుమానం వచ్చే సంఘటనే ఓ మెట్రోరైల్లో జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఎవరైనా స్నానం ఎక్కడ చేస్తారు? అని అడిగితే బాత్రూంలో అని సమధానం వస్తుంది. కానీ న్యూయార్క్ లో జరిగిన ఈ సంఘటన చూస్తే బహుశా మీ సమాధానం తప్పేమో అని మీకు అనుమానం రావోచ్చు. అది న్యూయార్క్ లోని ఒక మెట్రోరైలు.. అందులో జనాలు ఎక్కి ఎవరిపని వారు చేసుకుంటున్నారు. అక్కడికి అప్పటికే ఓ బాత్ టబ్ తో వచ్చిన ప్రయాణికుడు సడెన్ గా ఆ బాత్ టబ్ లో స్నానం చేయడం ప్రారంభించాడు.
వాటర్ బాటిల్ లోని నీళ్లను తలపై చల్లుకుంటూ ఒళ్లంత రుద్దుకుంటూ ఉన్నాడు. ఆ నీళ్లు కాస్త పక్కనే ఉన్న మరో ప్రయాణికుడి మీద పడటంతో ఆ వ్యక్తి అతడిని ప్రశ్నించాడు. దాంతో స్నానం చేసేవాడు కాస్తా ఆ ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. దాంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ ప్రయాణికుడిని పక్కకు లాక్కూపోయాడు. స్నానం చేసే వ్యక్తి బాత్ టబ్ లో పడి, లేచి పక్కకు పోయాడు.
ఇక ఈ తతంగాన్ని అంతా వీడియో తీసిన ఓ నెటిజన్ దాన్ని ట్వీటర్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఆ వింత వ్యక్తిపై నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. పిచ్చి పలు రకాలు అన్ని విన్నాం గాని ఇప్పుడే చూడటం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మెట్రో ట్రైన్ లో స్నానం చేసిన ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
New York is not a real place 😭😭😭 pic.twitter.com/sUjvFBh1If
— ENTERTAINMENT NETWORK (@dailyinstavids) August 25, 2022