కేజీ దొండకాయలు ధర ఎంత ఉంటుంది..?. మహా అయితే రూ.30 ఉంటుందేమో కదా. కానీ... ఓ చోట మాత్రం ఏకంగా రూ.900 ఉంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. మరి.. ఈ వివరాల్లోకి వెళ్తే..
ఈ మధ్యకాలంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక కూరగాయల ధరలు కూడా బాగా పెరిగుతున్నాయి. గతంలో ఉల్లిగడ్డలు, టమాటలు 150 దాట్టాయి. ఇలా అన్ని రకాల కూరగాయాల ధరలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే.. కేజీ దొండకాయలు 900 రూపాయలు పలుకుతుంది. మరీ అంత ధర అనే ఎందుకనే సందేహం మీకు రావచ్చు. మరి.. ఈ సందేహాలకు సమాధానాలు దొరకాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
నేటికాలంలో చాలా మంది చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తుంటారు. అయితే అలా విదేశాలకు వెళ్లిన మన వారికి ఆహారం విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. మన ఆహార పదార్ధాలు అక్కడ దొరక ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక అక్కడ మన బియ్యం, కూరగాయాల ధరలు భారీగా ఉంటాయి. గతంలో ఓ పండగ సందర్భంలో అమెరికాలో నాలుగు మామిడి ఆకులు 80 రూపాయిలకు భారతీయులు కొనుగోలు చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా లండన్ లో స్థిరపడిన ఓంకార్ ఖండేకర్ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సదరు వ్యక్తి అక్కడ కూరగాయలు కొనడానికి వెళ్లాడట. అక్కడ దొండకాయల ఖరీదు చూసి షాకయ్యాడు. వెంటనే వీడియో తీసి సోషల్ మీడీయాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అందులో లండన్‌లోని మార్కెట్‌లో ఉన్న కొన్ని కూరగాయల ఫోటోలను షేర్ చేశాడు. పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ, , కోడిగుడ్లు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. అయితే అక్కడ.. కిలో దొండకాయల ధర 8.99 పౌండ్లుగా కనిపించింది.
అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 919గా ఉంటుంది. అయితే ఓంకార్ ఖండేకర్ షేర్ చేసిన కూరగాయాల ధరలు చూసి.. అందరూ షాకయ్యారు. అంత ధర అంటూ.. అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. రోమ్ లో ఉంటే రోమ్ లో ఉన్నట్లే ఉండాలని.. దొండకాయలు తినకూడదు అంటూ ఓ నెటిజన్ కామెంట్స్ చేశారు. మరి.. వైరల్ అవుతున్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
London is nice and all but parwal for Rs 900/kg is🤯 pic.twitter.com/8KgcNzv8tN
— Omkar Khandekar (@KhandekarOmkar) April 19, 2023