సాధారణంగా చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే తెగ మారాం చేస్తుంటారు. అప్పటి వరకు ఇంట్లో వాళ్లతో ఆటలు ఆడుకుంటూ ఉన్న పిల్లలను ఒక్కసారే పాఠశాలకు పంపడంతో ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. ఇక మారాం చేసే పిల్లలకు ఇష్టమైన బొమ్మలు, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ కొనిస్తామని చెప్పి స్కూల్ కి పంపుతుంటారు.
స్కూల్ వెళ్లాలంటే పిల్లలు ఎంతలా మారాం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అప్పటి వరకు ఇంట్లో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేసిన చిన్న పిల్లలు ఒక్కసారిగా పాఠశాల వాతావరణానికి అలవాటు పడరు. అందుకే ఇటీవల పిల్లలకు మూడేళ్ల వయసు నుంచే స్కూల్ వాతావరణానికి అలవాటు చేస్తున్నారు తల్లిదండ్రులు. అయినప్పటికీ కొంతమంది పిల్లలు స్కూల్ కి వెళ్లమని మారాం చేస్తే చాక్ లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇలా వారికి ఇష్టమైనవి కొనిపెట్టి మరీ పంపిస్తుంటారు. కానీ ఓ ఐదేళ్ల పాప స్కూల్ కి వెళ్లనని మారాం చేస్తే ఏకంగా కోట్ల విలువైన కారు కొనిపించారు. ఈ ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మలేషియాకు చెందిన ఫర్హనా జహ్రా పెద్ద పారిశ్రామిక వేత్త. ఎన్నో వ్యాపారాలు కొనసాగిస్తూ కోట్లు సంపాదించారు. ఆయనకు ఫాతిమా అనే ఐదేళ్ల కుమార్తె ఉంది. ఫర్హానా జహ్రాకు ఫాతిమా ఒక్కగానొక్క సంతానం.. అందుకే ఆమెను పుట్టినప్పటి నుంచి ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఇటీవల ఫాతిమా అనారోగ్యం తో ఇబ్బంది పడింది.. దాంతో ఆమెను స్కూల్ కి పంపించకుండా ఇంట్లో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత ఫాతిమా ఆరోగ్యం బాగుపడింది.. ఇంట్లో చలాకీగా ఆడుకోవడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఫర్హానా జహ్రా తమ పాపను మళ్లీ స్కూల్ కి పంపించాలని అనుకున్నాడు. ఇందుకు అన్నీ సిద్దం కూడా చేశారు.
ఫర్హానా దంపతులు తమ పాప ఫాతిమాను స్కూల్ కి వెళ్లాలని సూచించారు. చాలా గ్యాప్ తర్వాత స్కూల్ కి వెళ్లాలంటే ఫాతిమాకు నచ్చలేదు.. తాను స్కూల్ కి ససేమిరా వెళ్లనని మారాం చేసింది. దీంతో తమ పాపకు ఏదైనా మంచి గిఫ్ల్ ఇవ్వాల ని అనుకున్నారు తల్లిదండ్రులు. అయితే ఫాతిమా పుట్టిన రోజు దృష్టిలో పెట్టుకొని నీకు ఏం గిఫ్ట్ కావాలని అడిగారు తల్లిదండ్రులు. తనకు మెర్సిడెస్ జి వ్యాగన్ లేదా బీఎండబ్ల్యూ కావాలని కోరింది. ఆ కారులో రెగ్యూలర్ గా స్కూల్ కి వెళ్తానని తల్లిదండ్రులతో చెప్పింది. కూతురు కోరిక మేరకు పుట్టిన రోజు నాటికి రూ.3 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు కనిపించాడు ఫర్హానా. ఈ వార్త స్థానిక మీడియా లో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.