ప్రస్తుతం ప్రపంచ వేదిక మీద మన ప్రధాని నరేంద్ర మోదీకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు..
దేశంలో ఉండే ప్రజల మధ్య పేద, ధనిక అంతరాలు ఉంటాయి. అలా కాకుండా.. దేశానికి సంబంధించి కొందరు వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యత ఉంటాయి. అంటే రాష్ట్రపతిని ప్రథమ పౌరుడు అని పిలవడం ఇలా అన్నమాట. ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే.. వారికి ప్రత్యేక అతిథి మర్యాదలు చేస్తారు. ప్రొటోకాల్ ప్రకారం నడుచుకుంటారు. అదే విదేశాల్లో సమావేశాలు జరిగితే.. అక్కడికి ఆయా దేశాల తరఫున హాజరయ్యేవారంతా సమానమే. అధికారం, హోదా అందరికి ఒకేలా ఉంటుంది. అదిగో అలాంటి అంతర్జాతీయ వేదిక మీద.. ఓ దేశానికి ప్రధాన మంత్రి అయిన వ్యక్తి.. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘పపువా న్యూ గినియా’ దేశ ప్రధాని జేమ్స్ మరాపె పాదాభివందనం చేశారు. ఈ ఘటన జేమ్స్ స్వదేశంలోనే చోటు చేసుకోవడం మరో విశేషం. జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పపువా న్యూ గినియాకు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపె ఘన స్వాగతం పలికారు. విమానం దిగి ఆ దేశంలో కాలు మోపిన ప్రధాని మోదీని.. ఆత్మీయ ఆలింగనం చేసిన జేమ్స్ మరాపె.. ఆ తర్వాత మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. ఇది గమనించి మోదీ.. జేమ్స్‌ను పైకి లేపి భుజం తట్టి కౌగిలించుకున్నారు. అనంతరం ప్రధాని మోదీకి తమ దేశ అధికారులు, రాజకీయ నేతలను పరిచయం చేశారు జేమ్స్ మరాపె.
ఇక మోదీ పర్యటన సందర్భంగా.. పాపువా న్యూ గినియాలో ప్రవాస భారతీయులు ప్రధానికి భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీతో సెల్ఫీ దిగి.. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక పపువా న్యూ గినియాను సందర్శించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. ఇదిలా ఉండగా.. సూర్యాస్తమయం తర్వాత పపువా న్యూ గినియాకు వచ్చిన ఏ దేశ నాయకుడికి అయినా సరే అధికారికంగా స్వాగతం పలకకూడదని ఆ దేశంలో నియమం ఉంది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ కోసం పపువా న్యూ గినియా తమ దేశ సంప్రదాయానికి బ్రేక్ వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప (ఐలాండ్) దేశం రాత్రిపూట తమ దేశానికి చేరుకునే విదేశీ అతిథులను ప్రభుత్వ గౌరవంతో స్వాగతించదు.
కానీ భారతదేశం ప్రాముఖ్యత, ప్రపంచ వేదికపై ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని, అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పైగా ఆ దేశ ప్రధాని మోదీకి పాదాభివందనం చేయడం విశేషం. ఇక, ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కార్పొరేషన్ (ఎఫ్‌ఐపీఐసీ) సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పపువా న్యూ గినియాకు చేరుకున్నారు. ఈ సమావేశంలో 14 దేశాల నాయకులు పాల్గొంటారు. పపువా న్యూ గినియాలో పర్యటించిన అనంతరం ప్రధాని మోదీ.. నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి పపువా న్యూ గినియా ప్రధాని చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Papua New Guinea for the second leg of his three-nation visit after concluding his visit to Japan. He was received by Prime Minister of Papua New Guinea James Marape. pic.twitter.com/U94yUQ2aCl
— ANI (@ANI) May 21, 2023