అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకుని చొక్కాలెగరేస్తున్న తాలిబన్లుకు భారీ షాక్ తగిలింది. తాలిబన్లు పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు యత్నించటంతో పంజ్‌షీర్ సైన్యం వారి వ్యూహాలను తిప్పికొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 300 మంది తాలిబన్లను పంజ్‌షీర్ సైన్యం అంతమొందించినట్లు ఓ జాతీయ మీడియా నుంచి వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకోవటంతో పాటు పక్కనున్నపంజ్‌షీర్ లోయపై కన్నేశారు తాలిబన్లు.
ఎలాగైన దీనిని ఆక్రమించుకునేందుకే ప్రణాళికలు సైతం రచించి ఆ లోయపై కన్నేసి ఈ విధమైన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ఇది తెలుసున్న పంజ్‌షీర్ సైన్యం కాలు దువ్వతున్న తాలిబన్లకు గువ్వ గుబ్బుమనే జవాబిచ్చారు. ఇక అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులు మాత్రం చాలా ఘోరంగా దర్శనమిస్తున్నాయి. ఆ దేశ అధ్యక్షుడే అక్కడి నుంచి పారిపోవటంతో పరిస్థితి తీవ్రతను మనం స్పష్ఠంగా అర్థం చేసుకోవచ్చు. ఈ భయంతోనే ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాల వైపు దీనంగా చూస్తున్నారు.
దీంతో తాలిబన్ల ఆగడాలను భరించలేక ఇప్పటికే చాలా మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయం నుంచి పక్క దేశాలకు పరుగులు పెడుతున్నారు. ఇక రోజు రోజుకు తాలిబన్ల ఆగడాలు శృతి మించుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వారి దారుణాలపై ఆ దేశ మాజీ జడ్జీ బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఆడవాళ్లపై వారు వ్యవహరించే తీరు మరీ మూర్ఖంగా ఉందని, వారిని లోబరుచుకుని సెక్స్ బానిసలుగా తయారు చేసి ఇతర దేశాలకు తరలిస్తున్నారంటూ తెలిపారు. రాను రాను అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితి తీవ్రత ఎలా మారనుందోనని ఆ దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.