వయాగ్రాను దేశం బ్యాన్ చేయటంతో కొంతమంది మగాళ్ల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలోనే వయాగ్రాకు ప్రత్యామ్నయం వెతకటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే వారికి..
సాధారణంగా శృంగారంలో ఎక్కువ సేపు ఉండటానికి మగాళ్లు.. టాబ్లెట్లు, ఇతర ఔషదాలు వాడుతూ ఉంటారు. అలాంటి ఔషదాల్లో వయాగ్రాకు ప్రపంచ వ్యాప్తంగా చాలా గిరాకీ ఉంది. అయితే, ఈ వయాగ్రా కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో కొన్ని దేశాలు దాని వాడకాన్ని నిలిపేశాయి. దేశ ప్రజలు దాన్ని వాడకుండా బ్యాన్ చేశాయి. పాకిస్తాన్ కూడా తమ దేశంలో వయాగ్రా వాడకాన్ని నిషేధించింది. అయితే, వయాగ్రా అందుబాటులో లేకపోవటంతో పాకిస్తాన్‌లోని మగాళ్లు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త పద్దతిని ఫాలో అయిపోతున్నారు. శృంగార సామర్థ్యం పెంచుకోవటానికి ఏకంగా ఉడుము నుంచి తయారు చేసిన నూనెను వాడుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ ప్రభుత్వం వయాగ్రా నిషేధించటంతో రావల్పిండిలోని మగాళ్లు అల్లాడిపోయారు. వయాగ్రాకు ప్రత్నామ్నాయం కోసం వెతకటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే వారికి ఉడము నూనె గురించి తెలిసింది. ఇక వారు ఏ మాత్రం ఆలోచించలేదు. ఉడుము నూనె కోసం క్యూలు కట్టారు. అప్పుడే ఉడుమునుంచి తీసిన నూనెను తేలు నూనెతో పాటు మరికొన్నితో కలిపి వాడుతున్నారు. శృంగారం సమయంలో దీన్ని మర్మాంగానికి పూయటం ద్వారా స్టామినా పెరుగుతుందని వారు చెబుతున్నారు. అయితే, ఉడుము నూనెను వాడటం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని సైంటిఫిక్‌గా నిర్థారణ కాలేదు.
అయినప్పటికి కొన్ని దేశాల్లో ఉడుము నూనెను వాడుతూ ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున ఉడుములను పట్టుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో ఉడుము నూనె అమ్మే వారి దగ్గర పెద్ద ఎత్తున జనం గుమిగూడటం కనిపిస్తుంది. అంతేకాదు! ఆ వ్యక్తి అప్పుడే ఓ ఉడుమును చంపి నూనెను తయారు చేయటం కూడా అందులో ఉంది. మరి, శృంగార సామర్థ్యం కోసం పాకిస్తాన్ మగాళ్లు ఉడుము నూనె వాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Pakistan Quack ‘aphrodisiac’ from lizard a hit
📸 Farooq Naeem#AFP pic.twitter.com/ZqtI2LVNba— AFP Photo (@AFPphoto) April 28, 2023