ఏ సమాజంలో అయినా సరే వివాహ బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. సమాజ పురోగతిలో వివాహానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. మరణించే వరకు కలిసే ఉండాలని.. కష్ట సమయాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలబడాలని.. ఒకరితో ఒకరు నమ్మకంగా ఉండాలని బాసలు చేసుకుంటారు. ఆ ప్రమాణాలు నిలబెట్టుకోలేకపోతే విడాకులు తీసుకుంటారు. కొన్నాళ్ల క్రితం వరకు విడాకులు అంటేనే పెద్ద పాపంగా భావించేవారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోవడం అన్నా ఇబ్బంది పడేవారు. కానీ కాలం మారుతున్న కొద్ది మనుషల ఆలోచన ధోరణిలో కూడా మార్పు వస్తోంది.
నచ్చితే కలిసుందాం.. లేదా విడిపోదాం. అంతే తప్ప.. సమాజానికి భయపడి.. బలవంతంగా కలిసుండాల్సిన అవసరం లేదు అనే ఆలోచన విస్తరిస్తోంది. దాంతో ప్రస్తుతం సమాజంలో విడాకులు పెరిగిపోతున్నాయి. ఒక్కసారి విడాకులు తీసుకుంటేనే వింతగా చూస్తారు. కానీ ఇక్కడ ఓ రాజకీయ నాయకుడు రెండు సార్లు విడాకులు తీసుకోవడమే కాక.. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తనకంటే వయసులో 31 ఏళ్ల చిన్నదానితో. ఆ వివరాలు..
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు అమీర్ లియాఖత్ (49) తన భార్య, పాక్ నటీ తుబా అమీర్ నుంచి బుధవారం విడాకులు తీసుకున్నాడు. రెండో సారి పెళ్లి కూడా పెటాకులు అయ్యిందనే బాధ ఏమాత్రం లేదు. ఎందుకంటే.. అతడిని మూడో వివాహం చేసుకునేందుకు ఓ యువతి ఎదురు చూస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. రెండో భార్యకు విడాకులు ఇచ్చిన అదే రోజు ఆయన 18 ఏళ్ల సయేదా దానియా షాను మూడో వివాహం చేసుకున్నాడు. ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. తమను అందరూ ఆశీర్వదించాలని, తమ కోసం ప్రార్థన చేయాలని కోరాడు.
పెళ్లికి ముందే కొత్త భార్య గురించి అమీర్ లియాఖత్ సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు. అలాగే పెళ్లి తర్వాత ఇద్దరు ఒక టీవీకి ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అమీర్ లియాఖత్‌తో చిన్నప్పుడే ప్రేమలో పడినట్టు దానియా తెలిపింది. ఆయనను టీవీలో చూసి ఇష్టపడ్డానని చెప్పింది. ఇప్పుడు అమీర్ లియాఖత్‌తో పెళ్లి జరగడం నమ్మలేకపోతున్నానని అన్నది. కాగా వారిద్దరూ పెళ్లి చేసుకోవడంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమీర్ లియాఖత్‌కు శుభకాంక్షలు తెలియజేశారు.
అయితే అమీర్ లియాఖత్ పెళ్లిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకన్నా ఎంతో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ షేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య 31 ఏళ్లు తేడా ఉండటంతో సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు. అమీర్ లియాఖత్ 18 ఏళ్ల కిందటే తన భార్యను ఎత్తుకున్నారంటూ ఒకరు ట్వీట్ కూడా చేశారు. మరి ఈ మూడో వివాహంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.