మనం సినిమాల్లో ఏదైనా ఓపెనింగ్ చేసే సమయంలో రిబ్బన్ కటింగ్ సమయంలో ఫన్నీ సీన్లను క్రియేట్ చేసి చూపిస్తుంటారు. ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తన వీడియో షాప్ ఓపెనింగ్ కి పెద్ద మొద్దు తీసుకు వచ్చి రంపంతో కట్ చేయమని గెస్ట్ చెప్పడం.. అతను నానా అవస్థలు పడటం చూసి తెగ నవ్వుకున్నాం. అలాగే పలు చిత్రాల్లో ఓపెనింగ్ సమయంతో చాలా కామెడీ సీన్లు తెరపై చూసి ఆనందిస్తుంటాం. అయితే అలాంటి సీన్ నిజ జీవితంలో జరిగితే.. ఆ ఫోటోలు, వీడియో ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
సాధారణంగా పాకిస్తాన్ కి సంబందించిన చాలా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా పాకిస్థాన్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ ఎలక్ట్రానిక్స్ దుకాణాన్ని ప్రారంభించడానికి లాహోర్ వెళ్లాడు. ప్రారంభోత్సవం కోసం దుకాణ యజమాని రిబ్బన్ కట్టారు. రిబ్బన్ కట్ చేసేందుకు.. ఆయనకు కత్తెర ఇచ్చినా కూడా.. అది తుప్పు పట్టిపోవడంతో ఆ రిబ్బన్ అస్సలు కట్ కాలేదు. దాంతో ఈ మంత్రికి ఎక్కడో కాలింది.. ఇంకేముంది తన పళ్లతో ఆ రిబ్బన్‌ను కట్ చేశాడు.
ఒక్కసారే ఆ మంత్రి చేసిన పని చూసి పక్కన ఉన్నవాళ్లు తెగ నవ్వుకున్నారు. తర్వాత తన పళ్లతో చేసిన రిబ్బన్ కట్ వీడియోను ఫయాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్య అతిథిగా వస్తే ఆయనకు అసౌకర్యాన్ని కల్పించిన షాపు యజమానికి నాలుగు చివాట్లు పెట్టారు. ఏది ఏమైనా సదరు మంత్రి గారు చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
اپنے حلقے میں دوکان کے افتتاح کا انوکھا انداز۔۔۔!!! قینچی کند اور خراب تھی۔۔!!! مالک دوکان کو شرمندگی سے بچانے کے لیے نیا عالمی ریکارڈ قائم کر دیا۔۔!!!@UsmanAKBuzdar pic.twitter.com/MRxedX0ZaB
— Fayaz ul Hassan Chohan (@Fayazchohanpti) September 2, 2021