ప్రస్తుతం సమాజంలో పెళ్లి వార్తలు ఎంత సహజం అయ్యాయో.. విడాకుల వార్తలు కూడా అంతే సాధారణం అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ముఖ్యంగా విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కొందరు సెలబ్రిటీలు రెండు, మూడు సార్లు కూడా విడాకులు తీసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు, టీవీ ప్రముఖుడు ఆమిర్ లియాకత్ చేరారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈయన వివాహం అయ్యి నిండా 100 రోజులు కూడా పూర్తి కాలేదు. మరో విషయం ఏంటంటే.. ఇది ఈయనకు మూడో పెళ్లి. కానీ ఏం లాభం.. ఈ మూడో వివాహం కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: విడాకులు తీసుకున్న రోజే మరో పెళ్లి.. ఆ నేత తీరుపై విమర్శలు
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పార్టీకి చెందిన ఎంపీ ఆమిర్ వయసు 49ఏళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన 18ఏళ్ల దానియాను మూడో పెళ్లి చేసుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించింది. వీరిద్దరి మధ్య 31ఏళ్ల వయసు తేడా ఉంది. ఇక రెండో భార్యకు విడాకులు ఇచ్చిన రోజునే.. ఆమిర్ దానియాను మూడో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అయ్యి నిండా మూడు నెలల కూడా పూర్తి కాలేదు. మరోసారి విడాకుల వార్తలు తెర మీదకు వచ్చాయి. ఆమిర్ తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని.. విడాకులు ఇప్పించాల్సిందిగా ఆయనను మూడో వివాహం చేసుకున్న దానియా షా కోరుతుంది.
ఇది కూడా చదవండి: స్టార్ హీరోయిన్ విడాకుల ప్రకటన.. ఆ పనే కొంపముంచిందా?ఆమిర్‌తో తాను విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా దానియా షా వెల్లడించింది. కోర్టులో విడాకులకు అర్జీ పెట్టినట్లు తెలిపింది. దీనితో పాటు.. ఆమికర్ గురించి చాలా వివరాలు వెల్లడించాలంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. అంతేకాక ఆమిర్ తనతో చాలా కృరంగా ప్రవర్తించాడని తెలిపింది. తనను మూడేసి రోజులు గదిలోనే పెట్టి లాక్ చేసేవాడని.. తిండి కూడా పెట్టేవాడు కాదు అని ఆమె వెల్లడించింది. అంతేకాక ఆమిర్ తనను తుపాకీతో కాల్చేస్తానని బెదిరించేవాడని.. ఓ సారి గొంతు కూడా నొక్కాడని ఆరోపించింది. అయితే ఆమె ఆరోపణలని ఆమిర్ ఖండించాడు. కేవలం డబ్బు కోసమే ఆమె తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తుందని తెలిపాడు.
Dr @AamirLiaquat‘s wife @syedadaniamir says she has proofs of her husband’s illicit activities which she will reveal in due time.
Dania says she will not compromise with #AamirLiaquatHussain because he destroyed her life. #daniaamir #DaniaShah #amirliaquat #amirliaquathussain pic.twitter.com/vEbXF4XTen
— Hamza Azhar Salam (@HamzaAzhrSalam) May 7, 2022
ఇది కూడా చదవండి: ఫస్ట్ నైట్ నాడే భర్తకి భార్య షాక్! వెంటనే విడాకులు!
విడాకులతోపాటు తనకు మెయింటెనెన్స్ ఇప్పించాలని దానియా కోర్టును అభ్యర్థించింది. నెలకు లక్ష రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాలని కోరుతూ కోర్టుకు సమర్పించిన పత్రాలను దానియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదేకాక ఒక ఇల్లు, కారు మొత్తంగా రూ.11 కోట్ల విలువైన ఆస్తులను ఆమె డిమాండ్ చేసింది. ఇక వీరి విడాకులు ప్రస్తావన తెలిసిన తర్వాత నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘కుమార్తె వయసున్న యువతిని మూడో వివాహం చేసుకోవడమే సిగ్గులేని పని.. మళ్లీ మూడోసారి విడాకులు తీసుకుంటున్నావ్.. కొన్ని రోజుల వ్యవధిలో మరో వివాహం చేసుకుంటావ్.. మళ్లీ విడాకులు.. ఇది వ్యాపారమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక దానియాను కూడా విమర్శిస్తున్నారు నెటిజనులు. నువ్వు కేవలం డబ్బుల కోసమే ఈ వివాహం చేసుకున్నావని ట్రోల్ చేస్తున్నారు. ముచ్చటగా మూడో సారి విడాకులు తీసుకుంటున్న ఆమిర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Disgusting!! Amir liaquat is a certified psycho. Hamaray mulk se nikalo yaar isay 😩#DaniaShah #amirliaquat pic.twitter.com/gsKOWCdtoP
— ɴɪᴍʀᴀ ᴋʜᴀɴ (@NimraKhan104) May 7, 2022