ఇక్కడ ఉల్లికి ధర లేక రైతులను కన్నీళ్లు తెప్పిస్తుంంటే.. అక్కడ మాత్రం ఉల్లి ధర ఏకంగా ఆకాశానికి ఎగబాకింది. కిలో ఉల్లి ధర రూ.1200 పెరిగి అక్కడి సామాన్య ప్రజలు ఉల్లి కట్ చేయకముందే ధరను చూసి కన్నీళ్లు పెడుతున్నారు.
ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజుల నుంచి ఇండియాలో ఉల్లిపాయలను కట్ చేయకముందే ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఏకంగా కిలో ఉల్లి ధర రూ.20 మాత్రమే పలుకున్న ఈ తరుణంలో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల మహారాష్ట్రలోని ఓ రైతు 512 కిలోల ఉల్లిని మార్కెట్ కు తరలిస్తే.. అన్నీ పోను ఆ రైతు చేతికి కేవలం రూ.2 మాత్రమే వచ్చింది. ఈ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే ఇక్కడ ఉల్లి ధర లేక రైతులు అల్లాడుతుంటే.. అక్కడ మాత్రం ఏకంగా కిలో ఉల్లి ధర రూ.1200 పలుకుతోంది. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం.
ఇండియాలో గత కొన్ని రోజుల నుంచి ఉల్లి ధర రైతులను నష్టాల బాట పట్టిస్తుంది. కేవలం కిలో ఉల్లి ధర ప్రాంతాన్ని బట్టి రూ.20-02 పలుకుతుంది. కానీ, ఫిలిప్పీన్స్ దేశంలో మాత్రం కిలో ఉల్లి ధర దీనికి భిన్నంగా ఉంది. ఉల్లిని కట్ చేయకముందే అక్కడి ధరలు సామాన్య జనాలను కన్నీళ్లు తెప్పిస్తుంది. దేశ రాజధాని అయిన మనీలాలోని ఓ మార్కెట్ లో కిలో ఉల్లి ధర ఏకంగా రూ.1200కు ఏగబాకింది. దీంతో అక్కడి ప్రజలు ఉల్లిపాయలను కొనుగోలు చేయలేక పూర్తిగా వాడడమే మానేశారు. అయితే అక్కడ ఉల్లి వాడకంతో డిమాండ్ భారీగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం సైతం సరఫరాను పెంచేస్తోంది.
ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే కొందరు రైతులు పొలాల్లో ఉల్లి ఎదగకముందే మార్కెట్ కు తరలిస్తున్నారు. ఇక ఉన్నట్టుండి ఉల్లి ధరలను ఆకాశాన్ని తాకడంతో అక్కడి సాధారణ ప్రజలకు మాత్రం ఉల్లిని కట్ చేయకముందే ధరలను చూసి కనీళ్లు వస్తున్నాయి. ఇక్కడ ఉల్లి ధర ఎన్నడు కూడా ఈ స్థాయిలో లేదని సామాన్య జనం వాపోతున్నారు. ఇండియాలో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.2-20 వరకు మాత్రమే పలుకుతుండడంతో ఇక్కడి రైతులు అక్కడి ధరలను చూసి బాధపడుతున్నారు. ఫిలిప్పీన్స్ దేశంలో భారీగా పెరిగిన కిలో ఉల్లి ధర రూ.1200పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.