ఇప్పటికే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ రకాలకు తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపించటం కలవరపెడుతోంది. ఇప్పటికే 29 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. దాంతో మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళుతున్నాయి చాలా దేశాలు. ఓవైపు విమర్శలు ఎదురవుతున్నా.. తమ ప్రజల భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.అక్కడక్కడా ఒకటి,రెండు కేసుల భయటపడ్డాయి. తాజాగా నార్వేలోని ఓ క్రిస్మస్ పార్టీలో పాల్గొన్న వారిలో 50 మంది ఒమిక్రాన్ నిర్థారణ అయినట్లు సమాచారం.
ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.
ఇప్పటికే ఉన్న డెల్టాకు తోడు కొత్త రకం విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. గ్రీస్లో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య విభాగం వెల్లడించింది.డెల్టా వేరియంట్తో ఇప్పటికే ఐరోపా దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్తో ఆ భయాలు మరింత పెరిగాయి. బ్రిటన్లో దుకాణాలు, ప్రజా రవాణాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేసుకోవటం.
తాజాగా నార్వే రాజధాని ఓస్లోలో క్రిస్మస్ పార్టీలో పాల్గొన్న 50 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.ఓ రెస్టారెంట్ లో తమ ఉద్యోగులకు ఆ సంస్థ పార్టీ ఇచ్చింది. మరిన్ని కేసులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువమంది టీకా పూర్తిగా పొందినవారేనని తెలిసింది.
అమెరికా,సింగపూర్, సౌదీ అరేబియా, యూఈఏలోనూ కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్థరణ అయినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.
ఈ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి గత నెల 22న తిరిగి వచ్చారని…29న కరోనా పాజిటివ్ తేలిందని నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ తెలిపారు. ఒమిక్రాన్ గురించి ఆసాంతం తెలిసేందుకు 2 నుంచి 4 వారాలు పడుతుందని ఫౌసీ వివరించారు. వ్యాక్సినేషన్ తో సంబంధం లేకుండా ప్రయాణికులంతా ప్రయాణానికి ఒక రోజు ముందు పరీక్షలు చేయించుకోవాలని అమెరికా సీడీసీ స్పష్టం చేసింది.
ఒమిక్రాన్ భయాలతో దక్షిణ ఆఫ్రికా దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించటం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. అది వర్ణవివక్షతతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రతి చోటా వైరస్ ఉందని, ఇప్పుడు కొత్త వేరియంట్ను ప్రపంచానికి చెప్పిన వారిపై ఆంక్షలు విధించటమే ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. సురక్షితమైన ప్రయాణాలకు అవసరమైన సామగ్రి ఉన్నప్పుడు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.