కొత్త వేరియెంట్ తో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అధికారులు అప్రమత్తం అయ్యారు. వైద్యశాఖ ఆదేశాలతో మంగళవారం రాత్రి నుంచి ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేసులు నమోదైన దేశాల నుంచి వస్తున్న వారికి టెస్టులు తప్పనిసరి చేశారు. పాజిటివ్ వస్తే.. వారిని టిమ్స్ కు తరలించనున్నారు. వారి టెస్ట్ రిపోర్ట్ జీనోమ్ సీక్వెన్స్ కనుక్కునేందుకు ల్యాబ్ కు పంపనున్నారు. ఇప్పటివరకు ఎవ్వరికీ ఒమిక్రాన్ లక్షణాలు లేవన్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు.