జియోనా చానాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు. మనుమలు, మనవరాళ్లు, కోడళ్లను కలుపుకుంటే ఈయన కుటుంబ సభ్యుల సంఖ్య 160 పైమాటే. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న జియోనా చానా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయనపై డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి.ఈ నేపధ్యంలో ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న మహిళ ఎవరూఅని చాలామంది గూగులమ్మని సెర్చ్ చేసారు. అంతే ఆమె ఎవరో గూగులమ్మ చెప్పేసింది. ఆమే – టేలర్ వుల్ఫ్. లిండా లో ఉంటోన్న టేలర్ ఇప్పటి వరకూ 23 మందిని పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం తన శేష జీవితాన్ని అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో గడుపుతోంది. ఆమె చేసుకున్న చివరి పెళ్లి 1996లో గ్లిన్ ‘స్కాటీ’ వుల్ఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. గ్లిన్‌ను పెళ్లి చేసుకోవడానికి వీరిద్దరి మధ్య ప్రేమ ఏమీ లేదు. గ్లిన్ అప్పటికే 28 పెళ్లిళ్లు చేసుకున్నారు. 29వ పెళ్లి కూడా చేసుకొని రికార్డు సృష్టించడం కోసం లిండాను వివాహమాడారు. పెళ్లయిన ఏడాదికే 1997లో గ్లిన్ కన్నుమూశారు.
లిండా తొలిసారి 1957లో 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుందట. ఆమె తొలిభర్త జార్జ్ స్కాట్ వయసు అప్పటికే 31. ఏడేళ్లపాటు వీళ్ల సంసారం సాగింది. ఆమె జీవితంలో ఇదే సుదీర్ఘ వైవాహిక జీవితం. వీరిలో మోసగాళ్లున్నారు. నేరస్థులున్నారు. మతబోధకులు ఉన్నారు. గేలు ఉన్నారు, సంగీత కళాకారులు ఉన్నారు. ఆమెను కొట్టి హింసించిన వాళ్లున్నారు.
జీవితంలో ఏమీ లేక ఆమె వద్దే స్వాంతన పొందిన వాళ్లూ ఉన్నారు. ఈ క్రమంలోనే అత్యధికసార్లు పెళ్లి చేసుకున్న మహిళగా గిన్నిస్ రికార్డును కూడా ఈ 68 ఏళ్ల బామ్మ క్రియేట్ చేసింది.