సంస్కృతులకు, సంప్రదాయాలకు భారత దేశం పుట్టినిల్లు. పాశ్చాత్య దేశాలకు వెళ్లిన తమ మూలాలను, సంప్రదాయలను మరిచిపోవడం లేదు. ప్రతీ పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటుంటారు. పండగలకు ఉపయోగపడే వస్తువులు సొంత ఊరిలో ఉచితంగా దొరికేవి. వాటిని పరాయి దేశంలో ఎక్కువ డబ్బులు పోసి కొని మరీ.. పండగలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. అమెరికా లో ఉంటున్న ఇద్దరు భారతీయులు వినాయక చవితి సందర్భంగా మామిడి ఆకులు కొనేందు మార్కెట్ కు వెళ్లారు. అక్కడ డాలర్ కు 5 మామిడి ఆకులు మాత్రమే ఇస్తున్నారు. దీనిపై ఆ ఇద్దరు భారతీయులు తమ భావాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వినాయక చవితి పండగను భారత దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. గణపయ్య కోసం సినిమా సెట్టింగ్ రేంజ్ లో మండపాలను వేయించారు. దీపకాంతుల నడుమ గణనాధుడు మండపాల్లో కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు. భక్తులకు వివిధ రూపల్లో బొజ్జ గణపయ్య దర్శనమిస్తున్నాడు. ఇలా కొలువుదీరిన వినాయకుడు 10 రోజుల పాటు విశేష పూజల అందుకుని చివరకు గంగమ్మ ఒడిలోకి చేరుతాడు. ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో కూడా వినాయకుడి ఎంతో అందంగా అలకరిస్తున్నారు. పత్రితో స్వామి వారిని ఎంతో చక్కగా అలకరించిస్తున్నారు. అయితే స్వామి వారి అలంకరణకు వాడే పత్రి..గ్రామాల్లో అయితే ఠక్కున దొరుకుంది. అక్కడ ఉచితంగా ఇస్తామన్నా ఎవరు తీసుకోరు.
ఎందుకంటే ఎవరికి వారే అక్కడ పొలాల్లోకి వెళ్లి తెచ్చుకుంటారు. అయితే పట్టణాల్లో వారు మాత్రం మామిడి ఆకుల దగ్గర నుంచి ప్రతిదీ డబ్బులు పెట్టి కొన్నాల్సిందే. అయినా అన్నింటిని తెచ్చుకుని వినాయకుడి ఎంతో చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు. అలానే విదేశాల్లో ఉండే భారతీయులు సైతం వినాయక చవితిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. స్వదేశంలో చేసేవారికి ఏమి తీసిపోకుండా.. విదేశాల్లో ఉండే భారతీయులు వినాయకులను విభిన్నం ఆకృతుల ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కూడా స్వామి వారికి సంబంధించిన ప్రతిదీ కొన్నాల్సిందే. వాటి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతుంటాయి. అయినా సంప్రదాయాలు ముఖ్యమని ఖర్చుకు వెనుకాడకుండా స్వామి వారికి సంబంధించిన అన్నింటిని కొంటారు. అలా కొన్న మామిడి ఆకులతో, వివిధ రకల పత్రితో గణనాధుడిని అలకరిస్తారు.
అయితే తాజాగా ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. అమెరికాలో ఉన్న ఇద్దరు భారతీయులు వినాయక చవితి పండగ సందర్భంగా వస్తువుల కోసం మార్కెట్ వెళ్లారు. అక్కడ డాలర్లకు ఐదు మామిడి ఆకులు అమ్మడం చూసి ఆశ్చర్యపోయారు. మన కరెన్సీలో దాదాపు రూ.80కి ఐదు మామిడి ఆకులు అన్నమాట. అయితే తమ ఊరిలో పక్కింటి గోడ ఎక్కితే మామిడి కొమ్మలే తెంచుకోవచ్చు. అలాంటిది ఆకులనే ఇక్కడ డాలర్లలో కొనాల్సి వస్తుందని అనుకుంటారు. అయిన తప్పక మామిడి ఆకులను కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈవీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.