నిత్యానంద స్వామి.. ఈయన పేరు ఆధ్యాత్మికంగా కంటే కళాపోషణ పరంగానే ఎక్కువసార్లు వినిపించింది. లైంగిక వేంధింపుల కేసులో దాదాపు 50 సార్లు వాయిదాలకు తిరిగి.. పత్తా లేకుండా విదేశాలకు పరిపోయాడు. ఉన్నట్లుండి అకస్మాత్తుగా దక్షిణ అమెరికా దీవుల్లో తేలాడు. అక్కడ ఓ ద్వీపాన్ని కైలాస దేశంగానూ, తనని తాను ప్రధానిగానూ ప్రకటించుకున్నాడు. ఆ దేశానికి సొంత డాలర్ ను, తనకు ప్రత్యేకంగా రిజర్వ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ వార్తలు అన్నీ చూసి అంతా నిత్యానంద ఈ కేసులతో మతిస్థిమితం కోల్పోయాడు అనుకున్నారు. అయితే ఇప్పుడు నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచాడు. తన కైలాసానికి అమెరికా ప్రభుత్వం గుర్తింపు లభించిందని ప్రచారాలు మొదలు పెట్టాడు. న్యూజెర్సీలోని నెవార్క్ సిటీ కైలాస రాజ్యంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో అన్ని రాష్ట్రాలకు సొంత చట్టాలు, పాలసీలు ఉంటాయి. వారికి నచ్చిన విధంగా వారు ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు. ఆలాగే నెవార్క్ సిటీ కైలాస రాజ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది.
కైలాసాన్ని ప్రకటించిన తర్వాత నిత్యానంద స్వామి ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన పంపారు. తమ రాజ్యాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని కోరాడు. అప్పుడు అంతా దానిని జోక్ గా తీసుకున్నారు. కానీ, ఇప్పుడు నెవార్క వంటి ఫేమస్ సిటీ నిత్యానందతో ఒప్పందం కుదుర్చుకోగానే.. ఎప్పటికైనా ఐక్యరాజ్య సమితి కూడా కైలాసాన్ని గుర్తిస్తుందంటూ నిత్యానంద అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాము సాధించిన ఈ విజయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి.. ఐక్యరాజ్య సమితి కూడా పొరపాటున గుర్తిస్తే పరిస్థితి ఏంటనేది చాలా ఇప్పటి నుంచి ఊహిస్తున్నారు.
January 11, 2023 – Under the auspices of the Supreme Pontiff of Hinduism (The SPH) Bhagavan Nithyananda Paramashivam the United States of KAILASA and the City of Newark, New Jersey, USA, entered into a protocol bilateral agreement#Kailasa #Newark #NJ #Bilateral #USA #Nithyananda pic.twitter.com/NrF7MkQlPc
— KAILASA’s SPH Nithyananda (@SriNithyananda) January 12, 2023