కరోనా కోరల్లో చిక్కి అల్లాడుతున్న మానవాళి ఇప్పట్లో తేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్స్ మానవాళిపై దాడి చేస్తుంటే.. మరోవైపు కొత్త వైరస్ లు పుట్టుకొస్తుండటం అందరిని భయాందోళనకి గురి చేస్తోంది. తాజాగా.. సౌతాఫ్రికాలో ఇలాంటి కొత్త వైరస్ ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వైరస్ పేరు నియోకోవ్.
ఇది కూడా చదవండి:
సూపర్ మార్కెట్లలో లిక్కర్ అమ్మకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
సౌతాఫ్రికాలోని ఓ ప్రాంతంలో నివాసం ఉండే గబ్బిలాల్లో నియోకోవ్ వైరస్ బయటపడింది. ఈ వైరస్ పై చైనాలోని వూహన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడ్డట్టు రష్యా అధికార మీడియా సంస్థ స్పుత్నిక్ పేర్కొంది. నియోకొవ్ వైరస్ ప్రస్తుతం జంతువుల నుండి జంతువులకి మాత్రమే సోకే స్థితిలో ఉందని, కానీ.., ఇందులో మ్యుటేషన్ కారణంగా మనుషులకు సోకే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Scientists from China’s #Wuhan have warned of a new type of coronavirus #NeoCov in South Africa, stated to have a high death and transmission rate.https://t.co/anJjubG5fc
— News18.com (@news18dotcom) January 28, 2022
ఈ వైరస్ కి వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు.., మరణాల రేటు కూడా ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉందట. ఒకవేళ నియోకోవ్ విషయంలో పరిస్థితి చేజారితే.. వ్యాధి సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి చెందటం ఖాయమని వూహన్ శాస్త్రవేత్తలు తెలియచేశారు. అయితే.., నియోకోవ్ వైరస్ పై చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలపై మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే దీనిపై ఓ అంచనాకి రాగలమన్నది రష్యా శాస్త్రవేత్తలు వాదన. మరి.. ఇలా ఎప్పటికప్పుడు కొత్త వైరస్ లు పుట్టుకు రావడానికి కారణం ఏమై ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.