వ్యాపారం చేయాలన్న జిజ్ఞాస ఉండాలే కానీ.. తెలివి తేటలను పెట్టుబడిగా పెట్టి కూడా బిజినెస్ చేయోచ్చు. అయితే గురకను అమ్మి డబ్బులు సంపాదించవచ్చునని తెలుసా..? హా గురకను కూడా అమ్మోచ్చా అని భావిస్తున్నారా..? అవునండి.. ఈ వ్యాపారం కూడా నిరూపించిందో మహిళ.
ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే అన్నింటి రంగాల్లో కన్నా వ్యాపార రంగం మిన్న. ఇందులో డబ్బు, సమయం, లక్ కలిసి రావాలి. ఒకసారి పెట్టిన వ్యాపారం క్లిక్ అయితే వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. అదే గనుక డీలా పడిందా.. కుటుంబం మొత్తం నడి రోడ్డున పడిపోవాల్సిందే. ప్రపంచంలో అత్యధిక ధనవంతులుగా ఉన్నవారంతా వ్యాపార, వాణిజ్య వేత్తలేనన్న సంగతి విదితమే. అయితే వ్యాపారానికి కాదేదీ అనర్హం. వ్యాపారం చేయాలన్న జిజ్ఞాస ఉండాలే కానీ.. తెలివి తేటలను పెట్టుబడిగా పెట్టి కూడా బిజినెస్ చేయోచ్చు. అయితే గురకను అమ్మి డబ్బులు సంపాదించవచ్చునని తెలుసా..? హా గురకను కూడా అమ్మోచ్చా అని భావిస్తున్నారా..? అవునండి.. గురకతో వ్యాపారం చేయోచ్చని నిరూపించిందో మహిళ.
హాయిగా నిద్రపడుతున్న సమయంలో ఎవరైనా గురక తీస్తే కచ్చితంగా చిరాకు వస్తుంటూంది. కొంత మంది వింత వింత శబ్దాలు తీస్తుంటారు. కొంత మంది విజిల్ వేస్తే, కొంత మంది అరుపులాంటి శబ్దాలు వస్తాయి. కానీ ఈ గురక పక్క వాళ్లను ఇబ్బంది పెట్టొచ్చు కానీ.. ఆమెకు కాసులను కురిపిస్తోంది. ఈ విషయాన్ని 26 ఏళ్ల అనా మల్ఫెయిర్ స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసింది. 33 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ లూయిస్‌తో గత ఏడాది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంది అనా. అయితే అతడికి గురకపెట్టే అలవాటు ఉంది. ఆమె ఈ గురక కారణంగా ఎన్నో నిద్రల్లేని రాత్రుళ్లు గడిపింది. దీనిపై లూయిస్ కూడా వాదించేవాడు. తను అలా గురక తీయడం లేదనే సరికి అనా ఓ నిర్ణయం తీసుకుంది. ఓ రోజు అతడి గురకను రికార్డు చేసి, మరుసటి రోజు అతడికి వినిపించింది.
మర్నాడు తన గురక శబ్దం విని లూయిస్ చాలా సిగ్గుపడ్డాడు. లూయిస్ ఫన్నీగా తీసుకోవడంతో అవకాశం వచ్చినప్పుడల్లా గురక శబ్దాన్నిరికార్డు చేసింది. అలా తన గురక శబ్దాన్ని సంవత్సరం పాటు రికార్డు చేసింది. అయితే ఈ గురక శబ్దాలను విన్న సంగీతానికి సంబంధించిన స్నేహితులు.. మ్యూజికల్ యాప్ స్పాటిఫై(Spotify)లో అప్ లోడ్ చేయమని చెప్పారు. అయితే ఈ గురకకు కూడా ఫ్యాన్స్ అయ్యారు. సుమారు 15300 మంది శ్రోతలు ఆమె పేజీని ఫాలో అవుతున్నారు. బాయ్ ఫ్రెండ్ గురకతో ఇబ్బందులు పడ్డ ఆమెకు ఇప్పుడు ఆదాయ వనరుగా తయారు అయ్యింది. అయితే అతి కొద్ది కాలంలోనే గురుక ద్వారా కొంత డబ్బును సంపాదించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.