ప్రేమ.. దాదాపుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదొక సమయంలో, ఏదో విధంగా దీని అనుభూతిని పొందే ఉంటారు. మీరు ప్రేమ గుడ్డిది అని వినే ఉంటారు. చాలా సందర్భాల్లో అది నిరూపితమైంది కూడా. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ వింటే ప్రేమ ఒక్క గుడ్డిదే కాదు.. పిచ్చిది, తిక్కది అని కూడా నమ్మేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయే లవ్ స్టోరీ అంత వింతగా, విచిత్రంగా ఉంటుంది కాబట్టి.
ఎందుకంటే అలా చెప్తున్నాం అంటే ఓ 18 ఏళ్ల యువతి 55 ఏళ్ల వ్యక్తి ప్రేమలో పడింది. అలా అతడిని ప్రేమిస్తూ ఆరాదిస్తూ చివరికి పెళ్లి కూడా చేసుకుంది. అందుకోసం సొంత కుటుంబాన్ని, సమాజాన్ని కూడా ఎదిరించింది. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ కు చెందిన 18 ఏళ్ల ముస్కాన్ అనే యువతికి పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం. ఆమె గాత్రం కూడా ఎంతో మధురంగా ఉండేది.
ఆమె ఇంటికి ఎదురుగా ఉండే 55 ఏళ్ల ఫరూక్ కు ఆమె పాటలన్నా, ఆమె గాత్రమన్నా ఎనలేని ఇష్టం. దాంతో రోజూ ముస్కాన్ ఇంటికి వెళ్లి ఆమెతో పాటలు పాడించుకుని వింటూ ఉండేవాడు. సంగీతం విషయంలో వారి బాగా చర్చించుకుంటూ ఉండేవారు. ఆ క్రమంలోనే వారి మధ్య బంధం కాస్త బలపడింది. అయితే అది ప్రేమ అని తెలుసుకోవడానికి ఫరూక్ కు చాలా సమయం పట్టింది.
ఆ భావన ప్రేమ అని గ్రహించిన ముస్కాన్.. బాబీ డియోల్ సినిమాలోని ‘నా మిలో హంసే జ్యాదా’ అనే పాటను తరచూ పాడుతూ అతని తెలియజెప్పేందుకు ప్రయత్నించింది. అది గ్రహించడానికి ఫరూక్ సమయంలో పట్టడంతో.. నేరుగా ప్రపోజ్ చేసేసింది. ఆమె ప్రపోజల్ విన్న తర్వాత మొదట ఫరూక్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తేరుకుని అతను కూడా ఓకే చెప్పేశాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆమె ప్రేమ దొరకడం అతని అదృష్టంగా భావిస్తున్నట్లు ఫరూక్ చెప్పుకొచ్చాడు.
ఫరూక్‌తో ప్రేమ గురించి ముస్కాన్ మాట్లాడుతూ.. “ఫరూక్ నాతో మాట్లాడే తీరు, అతను నాపై చూపించే అభిమానం అతడిని ఇష్టపడేలా చేశాయి. స్నేహితులు, బంధువులు, కుటుంబం కాదంటున్నా.. నేను పట్టించుకోలేదు. ఫరూక్‌నే వివాహం చేసుకున్నాను. ఫరూక్ కోసం, అతని ప్రేమ కోసం నా ప్రాణాన్ని కూడా ఇచ్చేయగలను” అంటూ ముస్కాన్ వెల్లడించింది. ఓ యూట్యూబర్ చేసిన ఇంటర్వ్యూతో ఈ ప్రేమ కథ వెలుగు చూసింది. మరి ముస్కాన్- ఫరూక్ ప్రేమ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.