పిల్లలను క్రమశిక్షణతో పెంచడం అనేది చాలా మంది తల్లిదండ్రులకు కత్తిమీద సాము లాంటిది. వారు చేసే అల్లరికి పెద్దలకు పిచ్చేకి పోతుంది. పిల్లలను క్రమశిక్షణగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కఠినంగా కూడా వ్యవహరిస్తుంటారు. అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుని ఓ తల్లిదండ్రులు తమ కుమారుడికి సరైన దారిలో పెట్టారు. అతిగా టీవీ చూస్తోన్న తమ కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు ఆ తల్లిదండ్రులు ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. బలవంతగా కుర్చిలో కూర్చోబెట్టి రాత్రంతా టీవీ చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వార్త సంస్థ తెలిపిన కథనం ప్రకారం..
చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో నివసిస్తోన్న ఓ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లవాడు స్థానిక పాఠశాలలో చదువుతున్నాడు. అయితే ఆ పిల్లవాడికి అతిగా టీవీ చూస్తుండేవాడు. ఈ క్రమంలో స్కూల్ ఇచ్చే హోం వర్క్ ను కూడా సరిగ్గా చేసేవాడు కాదు. దీంతో అనేక సార్లు ప్రేమతో చెప్పి చూశారు. అయినా టీవీ చూడటం ఆ పిల్లవాడు మానలేదు. ఈక్రమంలో ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఇటీవల ఓ పనిమీద బయటకి వెళ్తూ.. హోం వర్క పూర్తి చేసుకుని, రాత్రి 8.30 కల్లా నిద్రపోవాలని బాలుడికి సూచించారు. బయటకి వెళ్లిన ఆ జంట ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే వారు ఇంటికి వచ్చే సమయానికి పిల్లవాడు హోం వర్క్ పక్కన పెట్టేసి.. టీవీ చూస్తున్నాడు. ఆ తర్వాత కొద్ది సమయానికి ఆ పిల్లవాడు నిద్రకు ఉపక్రమించాడు. దీంతో కోపంతో ఆ తల్లి.. ఎలాగైనా టీవీ మాన్పించాలని భావించింది.
నిద్రపోతున్న కుమారుడిని లేపి బలవంతంగా టీవీ ముందు కూర్చోబెట్టింది. కొద్ది సమయం పాటు ఆసక్తిగా టీవీ చూసిన బాలుడు.. క్రమంగా కళ్లు అలసట చెందడంతో కూర్చోలేకపోయాడు. నిద్రకు ఆగలేకపోయాడు. నిద్రపోతాను అంటూ ఏడుపులు మొదలు పెట్టాడు. అయినా ఆ తల్లిదండ్రులు కనికరించకుండా తెల్లవారు జామున 5 గంటల వరకు టీవీ చూపెడుతూ..నిద్రపోనివ్వలేదని.. స్థానికంగా ఉండే ఓ మీడియా సంస్థ తెలిపింది. అయితే తాము చేసిన ఈ కఠినమైన పని వలన పిల్లవాడిలో మార్పు వచ్చేలా చేసిందని తల్లి పేర్కొనడం గమనర్హం. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. పిల్లలకు ఇలాంటివి చాలా కఠినమైన శిక్ష అంటూ పలువురు స్పందించారు. ప్రేమతో పిల్లలను సరైనా మార్గంలో పెట్టాలే కానీ.. ఇలా దారుణంగా శిక్షించడం సరైనది కాదని కొందరు అభిప్రాయపడ్డారు.